రోగ్` హీరో కోసం తేజ‌కు బంప‌ర్ ఆఫ‌ర్ !

0
`రోగ్` చిత్రంతో టాలీవుడ్ కు హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు ఇషాన్. తొలి సినిమాతోనే న‌టుడిగా పాస్ మార్కుల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. ఇక కెరీర్ ను జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుకుని ముందుకెళ్ల‌డ‌మే. అయితే పూరి జ‌గ‌న్నాధ్ తోనే ఇషాన్ మ‌రో సినిమా చేయ‌నున్నాడ‌ని అప్ప‌ట్లో  ప్ర‌చారం సాగింది. అందులో వాస్త‌వమెంత‌న్న‌ది తెలియదుగానీ..అంత‌కన్నా ముందే  ఇషాన్ తో  డైరెక్ట‌ర్ తేజ ఓ చిత్రం చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాడ‌ని స‌మాచారం.
నూత‌న న‌టీన‌టుల‌ను ప్రోత్స‌హిస్తు  సినిమాలు చేయ‌డంలో తేజ ఎప్పుడూ ముందుంటాడు.  అయితే ఇప్పుడు ఇషాన్..బ్ర‌ద‌ర్ సి.ఆర్ మ‌నోహ‌ర్ త‌న త‌మ్ముడుతో ఓ సినిమా చేయాల్సిందిగా తేజ‌కు బంఫ‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన‌ట్లు ఫిలిం స‌ర్కిల్స్ లో వినిపిస్తోంది. ఆ ప్ర‌పోజ‌ల్ కు తేజ కూడా ఒకే చెప్పాడ‌ని స‌మాచారం.  ఇటీవ‌లే తేజ క‌థల విష‌యంలో కొత్త‌గా ఆలోచిస్తున్నాడు. డిఫ‌రెంట్ గా సినిమాలు చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. దీనిలో భాగంగా త‌న ఛేంజ్ ఓవ‌ర్ కు ఇషాన్ ప‌నికొస్తాడ‌ని ఈ ఆఫ‌ర్ ని ఒకే చేసిన‌ట్లు ఆయన క్లోజ్ సోర్స్ ద్వారా తెలిసింది. ప్ర‌స్తుతానికి తేజ‌కు ఎలాంటి క‌మింట్ మెంట్లు కూడా లేవు. త్వ‌ర‌లోనే ఆయ‌న తెర‌కెక్కించిన నేనే రాజు …నేనే మంత్రి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

నాన్న ప్రేమ‌క‌థ‌ల‌న్నింటికంటే భిన్న‌మైన‌ది `మోహ‌బూబా`: ఆకాష్ పూరి
ఆకాష్ పూరి, నేహా శ‌ర్మ జంట‌గా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన `మెహ‌బూబా` మే11న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ సం...
కాజ‌ల్ కు పెద్ద‌మ్మ ప్ర‌మోష‌న్
చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ కు పెద్ద‌మ్మ‌గా ప్ర‌మోష‌న్ వ‌చ్చింది. కాజ‌ల్ చెల్లెలు నిషా అగ‌ర్వాల్ పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ వియాన్ని కాజ...
ఇంద్ర‌`లో బాల‌న‌టుడు తేజ హీరో అయ్యాడు
`చూడాల‌ని ఉంది`, `ఇంద్ర‌` చిత్రాల్లో న‌టించిన‌ బాల‌న‌టుడు తేజ గుర్తున్నాడు క‌దా? .. మ‌హేష్ `యువ‌రాజు` మూవీలోనూ బాల‌కుడిగా అల‌రించాడు. ఈ కుర్ర...
powered by RelatedPosts