`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌

0

మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం హైద‌రాబాద్ లో పాత్రికేయుల‌తో రవితేజ మాట్లాడుతూ….

ఇందులో నాది ఒక అనాథ పాత్ర. ప్రతి మనిషిలోను ఏదో ఒక బంధాన్ని వెతుక్కునే మనిషిలా కనిపిస్తాను. ఎప్పుడూ జనాల మధ్యలోనే ఉండాలనేది సినిమాలో నా ఫిలాసఫీ. పెద్దవాళ్ళ గురించి చెప్పడం జరిగింది. పెద్దవాళ్ళంటే చేతకానీ వాళ్ళు కాదు నిలువెత్తు అనుభవం అనే డైలాగ్ కూడా ఉంది. ఆ పాయింట్ నన్ను బాగా టచ్ చేసింది. పెద్దవాళ్ళ టాపిక్, మంచి ఫన్, హీరోయిన్ తో లవ్ ట్రాక్, నా పాత్ర ఈ సినిమాలో హైలెట్ గా నిలిచే అంశాలు. మా సినిమా నేల టిక్కెట్టు వాళ్లనే కాకుండా బాల్కనీ వాళ్ళ చేత కూడ విజిల్ వేయిస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చే సినిమా ఇది. కళ్యాణ్ కృష్ణ చాలా మంచి దర్శకుడు. అతని సినిమాల్లో క్లాస్ టచ్, మాస్ టచ్ రెండూ ఉంటాయి. ఈ సినిమాలో కూడా అంతే. ఆయన ట్రీట్మెంట్ కనిపిస్తుంది. నిర్మాత‌ రామ్ చాలా మంచి వ్యక్తి. ఎప్పుడూ నిజాయితీగా, పాజిటివ్ గా ఉంటారు. ఆయనతో ఒక సినిమా కాదు ఇంకా ఇంకా సినిమాలు చేయాలని ఉంది. సినిమాల ప‌ట్ల చాలా ఫ్యాష‌న్ గా ఉంటారు. ఆయ‌న‌కు చాలా వ్యాపారాలున్నాయి. డ‌బ్బు సంపాదించ‌డం కోసం సినిమాల్లోకి రాలేదు. కేవ‌లం ఫ్యాష‌న్ తోన్ తోనే ఇక్క‌డికి వ‌చ్చారు` అని అన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
నాన్న ప్రేమ‌క‌థ‌ల‌న్నింటికంటే భిన్న‌మైన‌ది `మోహ‌బూబా`: ఆకాష్ పూరి
ఆకాష్ పూరి, నేహా శ‌ర్మ జంట‌గా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన `మెహ‌బూబా` మే11న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ సం...
త‌ల్లిదండ్రుల గొప్ప‌త‌నాన్ని తెల‌యజేసే `స‌త్య గ్యాంగ్‌` - సుమ‌న్‌
సాత్విక్‌ ఈశ్వర్‌ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెంబర్‌ వన్‌ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్య...
powered by RelatedPosts