నాగార్జున గురించి వ‌ర్మ ఎమ‌న్నాడంటే?

0

25 ఏళ్ల తర్వాత తనకో కొత్త హీరో దొరికాడని అంటున్నారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ఇంతకీ ఎవరా హీరో అని ఆలోచిస్తున్నారా? ఎవరో కాదు..అక్కినేని నాగార్జున. వర్మ-నాగ్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘గన్’, ‘సిస్టమ్‌’ అనే టైటిళ్లను పరిశీలిస్తున్నారు. ఇందులో నాగ్‌కి జోడీగా మైరా సరీన్‌ నటిస్తోంది.

దాదాపు 25 ఏళ్ల తరువాత వర్మ..నాగ్‌తో తీస్తున్న చిత్రమిది. మరో విషయమేంటంటే..వర్మ-నాగ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన తొలి చిత్రం ‘శివ’ చిత్రీకరణ ఈరోజే మొదలైంది.. ఈ సందర్భంగా వర్మ ఓ ట్వీట్‌ చేశారు. ‘ఈరోజు ఫిబ్రవరి 16. కొన్నేళ్ల క్రితం ఇదే రోజున శివ చిత్రీకరణ ప్రారంభించాను. ఈ సందర్భంగా ఇప్పుడు నేను తీస్తున్న కొత్త చిత్రంలోని నా కొత్త హీరో నాగ్‌ స్టిల్‌ను పంచుకుంటున్నాను. 25 ఏళ్లు వెతికిన తరువాత నాకు ఓ కొత్త హీరో దొరికాడు. అతనే ఇప్పటివరకు చేయని రియలిస్టిక్‌ యాక్షన్‌ హీరోగా నటిస్తున్న నాగార్జున’ అని వర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ప్ర‌తిభ‌కు ప్రోత్సాహం -వాళ్ల డ్రీమ్ ఫుల్ ఫిల్ చేయ‌డ‌మే AISFM ల‌క్ష్యం: AISFM చైర్మన్ అక్కినేని నాగార్జున
'AISFM గ్రాండ్ ఫిలిం ఫెస్టివల్ 2018 ' లో భాగంగా అన్నపూర్ణ ఇంటర్నేషనల్ ఫిలిం స్కూల్ విద్యార్థులు నిర్మించిన 8 చిత్రాల ప్రదర్శనఅన్నపూర్ణ ఇం...
నాని, నాగ్ ల‌ మల్టీస్టారర్‌ పాటల రికార్డింగ్‌ ప్రారంభం
కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని హీరోలుగా వైజయంతి మూవీస్‌ పతాకంపై టి.శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్‌ నిర్మిస్తున్న...
వ‌ర్మ‌కు పిచ్చ పిచ్చ‌గా న‌చ్చేసిన రంగ‌స్థ‌లం సాంగ్!
మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ -స‌మంత జంట‌గా న‌టిస్తోన్న `రంగ‌స్థ‌లం` తొలి పాట‌ను నిన్న రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ పాట సంగీత ప్రియుల్ని విశే...
powered by RelatedPosts