ప‌రుశురామ్ మృతిపై రామ్‌చరణ్‌ దిగ్భ్రాంతి

0


తన అభిమాని పరశురామ్‌ మృతిపట్ల కథానాయకుడు రామ్‌చరణ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరుశురామ్‌ది మహబూబ్‌నగర్‌లోని అయిజ గ్రామం. ఈ బాలుడు ‘మగధీర’ సినిమాలోని డైలాగ్‌లను అలవోకగా చెప్పేవాడు. అప్పట్లో అతడి డైలాగ్‌ వీడియోలు సోషల్‌మీడియాలో బాగా వైరల్‌ అయ్యాయి. బాలుడు డైలాగ్‌ చెబుతున్న తీరును చూసిన రామ్‌చరణ్‌ తన ఇంటికి పిలిపించుకుని సరదాగా కాసేపు ముచ్చటించారు. అతడికి టీషర్ట్‌ కూడా కానుకగా ఇచ్చారు. ఇటీవల పరశురామ్‌ అనారోగ్యంతో కన్నుమూశాడు.

ఈ విషయం తెలుసుకున్న రామ్‌చరణ్‌ ఫేస్‌బుక్‌ ద్వారా సంతాపం తెలిపారు. పరశురాం ఇకలేరని తెలిసి షాక్‌ అయ్యానని, తీవ్రంగా బాధపడ్డానని అన్నారు. అతడి లోటును మాటల్లో వివరించలేమని చెప్పారు. ఇలాంటి కష్ట సమయంలో ఆ కుటుంబానికి పూర్తి ప్రేమ అందుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. సోదరుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు రామ్‌చరణ్‌ పోస్ట్‌ చేశారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

రేపు శ్రీదేవి అంత్య‌క్రియ‌లు.. అభిమానుల కోసం భాగ్య బంగ్లాలో భౌతిక కాయం
నటి శ్రీదేవి భౌతికకాయం దుబాయ్‌ నుంచి ఈరోజు రాత్రి 10గంటలకు ముంబయి చేరుకునే అవకాశం ఉంది. అనంతరం ఆమె పార్థివదేహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు...
హాట్ స‌మ్మ‌ర్ లో సెగ‌లు పెంచే సినిమాలు
2018 వేస‌విని మ‌రింత హీటెక్కించ‌డానికి టాలీవుడ్ స్టార్ హీరోలు రెడీ అయిపోతున్నారు. వ‌రుసుగా టాప్ స్టార్లంద‌రూ ఒక‌రి త‌ర్వాత ఒకరి బ‌రిలోకి దిగిపోతు...
గుండు హ‌నుమంత‌రావుకు సినీ ప్ర‌ముఖుల నిశాళులు
గుండు హ‌నుమంతరావు మృతిప‌ట్ల పలువురు సినీ ప్రముఖులు ఎస్సార్‌ నగర్‌లోని ఆయన నివాసానికి వచ్చారు. హనుమంతరావుతో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటూ క‌న్నీటి...
powered by RelatedPosts