రెండు సినిమాలకు సైన్ చేసిన రామ్

0

100621751కొన్నాళ్లుగా సక్సెస్ లు సాధించడంలో తడబడుతున్న యంగ్ హీరో రామ్.. తన అప్ కమింగ్ మూవీ పండగ చేస్కోతో సక్సెస్ బాట పడతానని నమ్మకంగా ఉన్నాడు. షూటింగ్ క్లైమాక్స్ స్టేజ్ లో ఉన్న సినిమా సమ్మర్ లో ఆడియెన్స్ ముందుకు రానుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపిచంద్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ ఎనర్జీకి తోడు.. రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక పండగ చేస్కో సినిమా దాదాపుగా పూర్తవుతుండంతో.. హీరో రామ్ మరో రెండు సినిమాలకు సైన్ చేసినట్టు తెలుస్తోంది.
దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్న రామ్.. కిశోర్ తిరుమల దర్శకత్వంలోనూ ఓ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. పండగ చేస్కో సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ సినిమాలు సెట్స్ మీదకు వెళతాయని సమాచారం. శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కబోయే సినిమాకు శివం అనే టైటిల్ ఖాయమైనట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా అయేషా శర్మను ఎంపిక చేశారు దర్శకనిర్మాతలు. ఇక కిశోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కబోయే సినిమాలో మలయాళ భామ కీర్తి సురేశ్ హీరోయిన్ గా కన్ ఫామ్ అయినట్టు తెలుస్తోంది. మొత్తానికి మసాలా మూవీ తరువాత నయా ప్రాజెక్ట్ కోసం కొంత గ్యాప్ తీసుకున్న రామ్.. ఈ సారి మాత్రం స్పీడు పెంచినట్టు అర్థమవుతుంది. మరి.. వరుస సినిమాలకు కమిటైన రామ్.. వీటితో సక్సెస్ బాట పడతాడేమో చూడాలి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

powered by RelatedPosts