రామ్ చరణ్ ఆ చోట్ల వీక్ !

0



Ram Charan Photos21ప్రభాస్ ఓ కొత్త దర్శకుడితో కలసి చేసి మిర్చి సినిమాతో దాదాపు 50 కోట్లు రాబట్టాడు. అల్లు అర్జున్ అంతా స్టార్ వాల్యూ లేని సురేందర్ రెడ్డితో రేసుగుర్రం చేసి 50 కోట్లకు పైగా రాబడుతున్నాడు. మగధీర తప్ప చరణ్ హిట్స్ అన్ని 45 కోట్ల మార్క్ కి కాస్త అటు,ఇటుగా రాబడుతున్నాయి. మాస్ ఏరియాల్లో చరణ్ కి ఉన్న క్రేజ్ తో ఆ ఫీట్ సాధ్యమవుతుంది. కానీ నైజం , ఓవర్సీస్ కి వచ్చే సరికి చరణ్ బాగా డల్ అవుతున్నాడు. రేసుగుర్రం నైజంలోనే పద్దెనిమిది కోట్లు రాబట్టింది. ఓవర్సీస్ లో కూడా మిలియన్ డాలర్లకు పైనే వసూలు చేసింది. ఎవడు సినిమాకి , రేసుగుర్రం సినిమాకి నైజం లోనే ఆరు కోట్ల వ్యత్యాసం ఉన్నది. ఇక ఓవర్సీస్ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. చరణ్ సినిమాలు 50 కోట్లు దాటాలేకపోవడానికి అతనికి ఈ ప్రాంతాల్లో ఉన్న వీక్నేస్సే కారణం . ఇక నైన చరణ్ ఇక్కడ తన పరిధిని పెంచుకోకపోతే ….. ప్రభాస్ , అల్లు అర్జున్ కూడా తనని దాటిపోయే అవకాశం ఉన్నది. శ్రీను వైట్ల సినిమాతో చరణ్ కి ఉన్న ఆ వీక్ కూడా తొలిగిపోతుందని నమ్మకాలూ ఉన్నాయి. మరి రామ్ చరణ్ ఏమిచేస్తాడో చూడాలి. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో నటిస్తున్నాడు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి బండ్ల గణేష్ నిర్మాత.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

స్టార్ హీరోని టార్గెట్ చేసిన తేజ‌!
`నేనే రాజు నేనే మంత్రి` సినిమా స‌క్సెస్ తో తేజ మ‌ళ్లీ బ్యాక్ బౌన్స్ అయ్యాడు. డైరెక్ట‌ర్ గా ప‌ట్టాలు త‌ప్పి పోయినా బండిని ఒక్క హిట్ తో మ‌ళ్లీ ట్...
శ్ర‌ద్ధాకపూర్ ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతోంది!
మ‌న స్టార్ హీరోల్లో మ‌గువ‌ల గుండెల్లో మారాజాగా వెలిగిపోతున్న డార్లింగ్ హీరో ఎవ‌రో చెప్ప‌గ‌ల‌రా?  .. లిప్త పాటు కాలంలో  ప్ర‌భాస్ అంటూ ఈజీగానే చె...
ధైర్యం` హీరోయిన్ సీక్రెట్ మ్యారేజ్
అలనాటి నటి మున్‌మున్‌ సేన్‌ కుమార్తె, బాలీవుడ్‌ నటి రియా సేన్‌ రహస్యంగా వివాహం చేసుకుని షాక్ ఇచ్చింది.  కొంతకాలంగా రియా.. ఫొటోగ్రాఫర్‌ శివమ్‌ త...
powered by RelatedPosts