"ఆత్తారింట్లో….."అల్లుడు రామ్‌చరణ్

0

ramcharanఅత్తగారింటికి సంబంధించి మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ఏ విషయాన్ని మీడియాతో పంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడడు అని అందరూ అంటారు. అలాంటిది ఈ కుర్ర హీరో తన అత్తగారింటి మనుషులతో కలిసి దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇలాంటి అరుదైన ఫొటో దొరికితే ఇక అభిమానుల హడావిడి గురించి చెప్పడానికి ఏముంది?

టాలీవుడ్ యంగ్ హీరోల జంటలలో రామ్ చరణ్ ఉపాసన జంట చూడముచ్చటగా ఉంటుందని చాలామంది అంటారు. వీరిద్దరూ ఏదైనా ఫంక్షన్ కు వస్తే వీరిని కవర్ చేసే పనిలోనే ఎక్కువగా మీడియా కెమెరాలు ఉంటాయి. చిన్ననాటి నుండి తాను ప్రేమించిన కామినేని వారి అమ్మాయిని భార్యగా చేసుకున్న చరణ్ కూడ ఉపాసన ఇష్టాఇష్టాలకు చాల ప్రాముఖ్యతను ఇస్తూ ఆమె సమాజ సేవా కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ ఉంటాడు. సెలెబ్రెటీ భార్యగానే కాకుండా ఉపాసన అపోలో సంస్థల డైరెక్టర్ గా తన భాధ్యతలను చాల కష్టపడి నిర్వర్తిస్తుంది అనే పేరు కూడ ఉంది.

రామ్ చరణ్ తన భార్య ఉపాసన చుట్టాలతో తన ‘అత్తారింటి’ లో కెమేరాకు ఇలా పోజు ఇచ్చాడా అనిపించే ఫోటో ప్రస్తుతం చరణ్ అభిమానులను ఆనంద పరుస్తోంది. ఈ ఫోటోలో ఉపాసన తాత ప్రముఖ డాక్టర్ మరియు అపోలో సంస్థల చైర్మెన్ ప్రతాప్ సి. రెడ్డితో పాటు రామ్ చరణ్ అత్త, మామలు మరియు ఇతర కుటుంబ సభ్యులు కనిపిస్తున్నారు. ఏదేమైనా ఈ ఫోటో ఈరోజు వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.

ఈ ఫొటో చూస్తుంటే, “గోవిందుడు అందరి వాడేలే” అనిపించడం లేదూ?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సాహో కోసం మ‌రో బాలీవుడ్ స్టార్
ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `సాహో` కోసం చిత్ర ద‌ర్శ‌కుడు సుజీత్ ఏకంగా బాలీవుడ్ తారాతోర‌ణాన్ని రంగంలో కి దించేస్తున్నాడు. ఇప్ప‌టికే హీరో...
స్పైడ‌ర్ ఈవెంట్ కు రోబో కాబింనేష‌న్!
మ‌హేష్ క‌థానాయకుడిగా ఏ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `స్పైడ‌ర్‌` తెలుగు, త‌మిళంలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతున్న సంగతి తెలిసిందే...
పైసా వ‌సూల్ సాంగ్ టీజ‌ర్
`కన్ను కన్ను కలిశాయి.. ఎన్నో ఎన్నో తెలిశాయి` అంటూ సాగే వీడియో సాంగ్ ను విడుదల చేసింది పైసా వసూల్ చిత్రబృందం. నందమూరి బాలకృష్ణ, శ్రియ మధ్య సాగుత...
powered by RelatedPosts