ఎన్టీఆర్ సినిమా నుంచి అమ్మడు డ్రాప్..!

0

Rakul Preet Singh New Photos (18)ఒక్కోసారి అవకాశాలు ఎక్కువవడం కూడా కొత్త చిక్కులు తెచ్చిపెడుతుంటుంది. నిన్నటికి నిన్న.. ఇలా అవకాశాలు ఎక్కువై అందరికీ డేట్స్ అడ్జస్ట్ చేయలేక… నాగ్-కార్తీల మల్టీస్టారర్ నుంచి తప్పుకుంది శ్రుతిహాసన్. ఈ విషయంపై పీవీపీ సంస్థ సీరియస్ అవడంతో… ప్రస్తుతం కేసు నడుస్తోంది. ఆమధ్య ఓ తమిళ చిత్రం విషయంలో హన్సికపై కూడా ఇలాంటి వార్తలే వినిపించాయి. ఇక తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా డేట్స్ అడ్జస్ట్ చేయలేనంత బిజీ అవుతోందట. వివాదాల వరకూ వెళ్లలేదు కానీ.. ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం మాత్రం జారవిడుచుకోబోతోందట.
రామ్ ‘పండగచేస్కో’, రవితేజ ‘కిక్-2’, బాలీవుడ్ మూవీ ‘శిమ్లా మిర్చి’ చిత్రాల్లో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్… రామ్ చరణ్ సినిమాలో షూటింగ్ లోనూ పాల్గొంటోంది. మిగతా చిత్రాల షూటింగ్ పూర్తి కావస్తున్నప్పటికీ రామ్ చరణ్ సినిమా మాత్రం ఇటీవలే ప్రారంభమైంది. ఇక ఎన్టీఆర్-సుకుమార్ కాంబినేషన్ సినిమాలోనూ రకుల్ నే హీరోయిన్ గా ఎంపిక చేశారు. అయితే.. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ చిత్రానికి కాల్షీట్లు అడ్జస్ట్ చేయలేకపోవడంతో.. ఈ సినిమా నుంచి రకుల్ తప్పుకుంటోందనే ప్రచారం జరుగుతోంది. ఇందుకు కారణం.. రామ్ చరణ్ సినిమానేనట. ఇటీవలే ప్రారంభమవడం… సెప్టెంబర్ నాటికి విడుదల తేదీ ప్రకటించడంతో వీలయినంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నారట. సో… ఈ సినిమాకే రకుల్ ఎక్కువ క్యాల్షీట్స్ కేటాయించాల్సి ఉందట. మరోవైపు… ఎన్టీఆర్ సినిమానేమో.. ఎక్కువభాగం లండన్ లో చిత్రీకరణ జరుపుకోనుంది. దీంతో.. చేసేది లేక ఎన్టీఆర్ సినిమా నుంచి అమ్మడు డ్రాప్ అయిందంటున్నారు. అయితే.. ఈ విషయంపై సుకుమార్ సినిమా యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. మరి… ఎన్టీఆర్ సరసన రకుల్ నటిస్తోందో.. లేదో క్లారిటీ రావాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే…!

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

powered by RelatedPosts