‘యమదొంగ’ ను ఫాలో అవుతున్నాడు..

0

f471c4cbc7a7475e2adb73d8993411ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సోషియో ఫాంటసీ చిత్రం ‘యమదొంగ’. రాజమౌళి దర్శకత్వ ప్రతిభను చాటిచెప్పిన చిత్రమిది. యమలోకం సెట్, రాజమౌళి టేకింగ్, ఎన్టీఆర్ నటన ప్రతిదీ అద్బుతమే. వాటితో పాటు చిత్రంలో మాస్ ప్రేక్షకులను ‘యంగ్ యమ.. ‘ పాట బాగా ఆకట్టుకుంది. అర్చన, నవనీత్ కౌర్, ప్రీతీ జింగానియాలు ఈ పాటలో ఎన్టీఆర్ తో కలిసి స్టెప్పులేశారు. ముగ్గురు ఐటెం భామల అందాలు పాటలో అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఇదే ఫార్ములాను ‘బాహుబలి’లో ప్రయోగిస్తున్నాడు రాజమౌళి. ప్రభాస్, అనుష్క, తమన్నా నటీనటులుగా రూపొందుతున్న ‘బాహుబలి’లో నోరా ఫతేహి ప్రత్యేక గీతంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నోరాతో పాటు మరో ఇద్దరు అందగత్తెలు ఈ పాటలో స్టెప్పులు వేస్తున్నారని సమాచారం. ‘యంగ్ యమ’ పాట మాస్ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో.. ఈ పాట కూడా అదే రీతిలో ఆకట్టుకుంటందనే నమ్మకంతో రాజమౌళి ఉన్నారు. సెంటిమెంట్ ఫాలో అవుతూ ముగ్గురు అందగత్తెలకు పాటలో చోటు కల్పించారు

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

powered by RelatedPosts