రా..రా ప్రీ రిలీజ్ వేడుక‌

0


శ్రీకాంత్ , నాజియా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘రా రా’. . శ్రీమిత్ర చౌదరి సమర్పణలో విజి చెర్రీస్ విజన్స్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 23న విడుద‌ల‌వుతుంది. విజీ చెర్రిష్ ద‌ర్శ‌కుడు. ఈ కార్య‌క్ర‌మంలో హీరో శ్రీకాంత్‌, నాని, త‌రుణ్‌, రఘుబాబు, అలీ, హేమ‌, సదానంద్, నిర్మాత అశోక్‌, ప్ర‌తాప్‌, ఖ‌య్యుమ్‌, భూపాల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

స‌దానంద్ మాట్లాడుతూ – “ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌. సినిమా పెద్ద స‌క్సెస్ సాధించిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు మంచి పేరు తేవాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

నాని మాట్లాడుతూ – “నాకు అష్టాచ‌మ్మా నుండి శ్రీకాంత్‌గారితో మంచి ప‌రిచ‌యం ఉంది. న‌టుడిగా ఆయ‌నేంటో అంద‌రికీ తెలుసు. ఇప్పుడు హార‌ర్ మూవీ రా.. రా చేస్తున్నారు. ఈ సినిమా ఆయ‌న‌కు మ‌రో పెద్ద హిట్ చిత్రంగా నిలవాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

త‌రుణ్ మాట్లాడుతూ – “శ్రీకాంత్‌గారి 125వ సినిమా ఇది. అంద‌రూ క‌మెడియన్స్ క‌లిసి ఈ సినిమాలో న‌టించారు. సినిమా పెద్ద స‌క్సెస్ సాధించాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

అలీ మాట్లాడుతూ – “శ్రీకాంత్ తొలిసారి హార‌ర్ సినిమా చేస్తున్నారు. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌గారి చంద్ర‌ముఖి సినిమాలో రా..రా… అనే ప‌దం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ నెల 23న సినిమా విడుద‌ల‌వుతుంది“ అన్నారు.

ర‌ఘుబాబు మాట్లాడుతూ – “నిర్మాత విజ‌య్‌తో మంచి అనుబంధం ఉంది. ద‌క్షిణాది ఉన్న సినిమా ప‌రిశ్ర‌మ‌లో తెలుగులోనే ఎక్కువ మంది క‌మెడియ‌న్స్ ఉన్నారు. ప్ర‌తి స‌న్నివేశాన్ని ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేస్తారు“ అన్నారు.

నిర్మాత శ్రీమిత్ర చౌద‌రి మాట్లాడుతూ – “శ్రీకాంత్‌గారితో 24 సంవ‌త్స‌రాల అనుబంధం ఉంది. నా స్వంత బ్ర‌ద‌ర్‌లాంటి వ్య‌క్తి. ఈ క‌థ విన్న త‌ర్వాత విజ‌య్ డైరెక్ట్ చేయాల‌ని అనుకున్నాం. శ్రీకాంత్‌గారి వంటి సీనియ‌ర్ హీరో ఇలాంటి సినిమా చేయ‌డం గొప్ప విషయం. సినిమా త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది“ అన్నారు.

నిర్మాత విజ‌య్ మాట్లాడుతూ – “శ్రీకాంత్‌గారితో ఉన్న అనుబంధ‌మే ఈ సినిమా చేయ‌డానికి మ‌మ్మ‌ల్ని ముందుకు న‌డిపించింది. సినిమా బాగా వ‌చ్చింది. ఈ నెల 23న సినిమా విడుద‌ల‌వుతుంది. త‌ప్ప‌కుండా ఎంటైర్‌టైనింగ్‌గా ఆక‌ట్టుకుంటుంది“ అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు ష‌కీల్ మాట్లాడుతూ – “నాపై న‌మ్మ‌కంతో నాకు సినిమాకు సంగీతం అందించే అవకాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు, హీరో శ్రీకాంత్ అన్న‌య్య‌కు థాంక్స్‌“ అన్నారు.

శ్రీకాంత్ మాట్లాడుతూ – “నాని, త‌రుణ్‌ల‌కు నా స్పెష‌ల్ థాంక్స్‌. మ‌మ్మ‌ల్ని స‌పోర్ట్ చేయ‌డానికి ఇక్క‌డ‌కు వ‌చ్చిన అంద‌రికీ థాంక్స్‌. హార‌ర్ జోన‌ర్‌లో నేను చేసిన తొలి సినిమా. హార‌ర్ సినిమాలు చాలానే ఉన్నా.. ఈ సబ్జెక్ట్ కొత్త‌గా ఉంటుంది. ఈ 23న విడుద‌ల‌వుతున్న ఈ సినిమా నాకు మంచి స‌క్సెస్ అవుతుందనే న‌మ్మ‌కం ఉంది. నిర్మాత‌లు విజ‌య్‌, శ్రీమిత్ర చౌద‌రిల‌కు థాంక్స్‌“ అన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
‘ఆపరేషన్ 2019’ ట్రైలర్ లాంచ్
“గాంధీ కడుపున గాంధీ పుట్టడు, ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు, మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు.. ఎవరైనా సరే ప్రజల్లో నుంచే రావాలి వివిధ రూపా...
శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
powered by RelatedPosts