అలీ లేని పూరీ సినిమా?

0

Puri-Jagannadh-Ali-pose-photo-audioసినీ ప్రేమికుడికి, ముఖ్యంగా స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ అభిమానులకి ఇది మింగుడు పడని వార్త అని చెప్పుకోవాలి. ఎందుకంటే, పూరీ సినిమా అనగానే మిగతా విషయాలు ఎలా ఉన్నా, ఆలీ కామెడీ ట్రాక్ గురించి అందరికీ ఒక రకమైన ఎక్స్పెక్టేషన్ ఉండేది . ఎందుకంటే, ఇప్పటివరకూ ఆలీ లేకుడ్నా పూరీ చేసిన సినిమాలు ఒకటో రెండో ఉంటాయి మహా అయితే. దీన్నిబట్టి పూరీ సినిమాలో ఆలీ కి ఉన్న ప్రాముఖ్యత ఏమిటో ఇట్టే అర్ధమైపోతుంది. ఐతే, తాజా సమాచారం ప్రకారం, పూరీ తన తదుపరి సినిమాలో అలీకి చిన్న వేషం కూడా ఇవ్వడం లేదని తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ , స్టార్ కమెడియన్ కి ఝలక్ ఇచ్చాడనే టాక్స్ వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం పూరీజగన్నాధ్ తెరకెక్కిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ లో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఈ మూవీలో పూరీజగన్నాధ్ ఓ పవర్ ఫుల్ కామెడీ ట్రాక్ ని రాసుకున్నాడు. తాజాగా విడుదలైన ‘లవర్స్’ సినిమాలో మగజాతి ఆణిముత్యంగా సప్తగిరి చేసిన పిచ్చి కామెడీకి, సినీ ప్రేక్షకులు తెగ నవ్వుకున్నారు. సప్తగిరి గత సినిమాలలో చేస్తున్న కామెడీ సీన్స్ బాగా హిట్ కావడంతో, పూరీ జగన్నాద్ తన అప్ కమింగ్ మూవీలో సప్తగిరి అవకాశం ఇచ్చాడు. అంతే కాకుండా తనని హైలెట్ చేస్తూ కొన్ని కామెడీ సీన్స్ రాశాడు. ఎప్పుడూ ఆలీపై సపరేట్ కామెడీ ట్రాక్స్ రాసుకొనే పూరీజగన్నాధ్, ఈసారి ఆలీని వదిలేసి సప్తగిరిని ఎంచుకోవడంతో ఆలీకి పూరీ ఝలక్ ఇచ్చాడనే టాక్స్ వినిపిస్తున్నాయి.

ఈ సినిమా సప్తగిరి కెరీర్ కి టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందని భావిస్తున్నారు. జూనియర్ మూవీలో ఆలీ కామెడీ ట్రాక్ ఉన్నప్పటికీ, సప్తగిరీకే పూరీ ప్రాధాన్యం ఇవ్వడంతో, పూరీ జగన్నాధ్ తన మూవీలో ఆలీ సెంటిమెంట్ ని పూర్తిగా వదిలేశాడనే టాక్స్ సైతం వినిపిస్తున్నాయి. గతంలో పూరీ జగన్నాధ్ తీసిన ప్రతి మూవీలో ఆలీ కామెడీ చాలా పాపులర్ అయింది. ఆలీ, పూరీ కాంబినేషన్ మూవీ సక్సెస్ కి సెంటిమెంట్ అని కూడ పూరీ కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అలాంటిది తన అప్ కమింగ్ మూవీలో ఆలీని వదిలేసి సప్తగిరికి ఎక్కువ సీన్స్ ని కేటాయించడంతో, ఇది ఫిల్మ్ నగర్ వాసులకి మరింత హాట్ టాపిక్ గా మారింది. పూరీ, జూనియర్ ఎన్టీఆర్ ల సినిమా సెకండ్ షెడ్యూల్ సెప్టెంబర్ 10 నుండి ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. బండ్ల గణేశ్ ఈ సినిమాకి నిర్మాత.

ఇంతకీ, పూరీకి ఆలీ మీద బోర్ కొట్టేసిందా లేక , ప్రస్తుతం మంచి ఫాలోయింగ్ సంపాదించుకుని దూసుకుపోతున్న సప్తగిరి క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి ఈ సినిమా వరకే అలీని పక్కనబెట్టాడా …లేదంటే, ఇద్దరికీ చెడిందా ? అనే రకరకాల ఊహాగానాలు ఇండస్ట్రీలో జోరుగా సాగుతున్నాయి. ఈ విషయమై ఆలీ కానీ పూరీ కానీ ఏదో ఒక మాట ఇటు పడేసే దాకా, ఎవరిష్టం వచ్చినట్టు వారు అనుకోవడమే..!!

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సాహో కోసం మ‌రో బాలీవుడ్ స్టార్
ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `సాహో` కోసం చిత్ర ద‌ర్శ‌కుడు సుజీత్ ఏకంగా బాలీవుడ్ తారాతోర‌ణాన్ని రంగంలో కి దించేస్తున్నాడు. ఇప్ప‌టికే హీరో...
స్పైడ‌ర్ ఈవెంట్ కు రోబో కాబింనేష‌న్!
మ‌హేష్ క‌థానాయకుడిగా ఏ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `స్పైడ‌ర్‌` తెలుగు, త‌మిళంలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతున్న సంగతి తెలిసిందే...
పైసా వ‌సూల్ సాంగ్ టీజ‌ర్
`కన్ను కన్ను కలిశాయి.. ఎన్నో ఎన్నో తెలిశాయి` అంటూ సాగే వీడియో సాంగ్ ను విడుదల చేసింది పైసా వసూల్ చిత్రబృందం. నందమూరి బాలకృష్ణ, శ్రియ మధ్య సాగుత...
powered by RelatedPosts