మా బ్యాన‌ర్లో తొలి హిట్ సంతోషాన్నిచ్చింది: నిర్మాత రామ్మోహన్ రావు ఇప్పిలి

0

హరి హర చలన చిత్ర పతాకం పై ఈ నెల 6న విడుదలైన చిత్రం ” ఇంతలో ఎన్నెన్ని వింతలో” ఈ చిత్రం విడుదలై 2వ వారం లోకి అడుగుపెటింది. ఇప్పటికి అన్ని చోట్లా ప్రేక్షదారణ పొందుతుంది. ఈ సందర్బంగా ప్రొడ్యూసర్ రామ్మోహన్ రావు ఇప్పిలి ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా నిర్మాత రామ్మోహన్ రావు ఇప్పిలి మాట్లాడుతూ…

ముందుగా మా హరి హర చలనచిత్ర బ్యానర్ లో మొదటి చిత్రం “ఇంతలో ఎన్నెన్ని వింతలో” హిట్ ని మేము ఇంతగా ఎంజాయ్ చేస్తున్నాము, అంటే దానికి ముఖ్య కారణం మా మీడియా మిత్రులే అని నిస్సందేహం గా చెప్పుకొంటాము. మీరు అందరూ మీడియా ప్రీమియర్ షో కి వచ్చి మనస్ఫూర్తిగా మీ బ్లెస్సింగ్సు ఇవ్వడం, సినీయర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు గారు మా సినిమా పూర్తిగా చూసి మా యూనిట్ ని ఆశీర్వదించడం మాకు అతి పేద్ద కంప్లిమెంట్ గా భావించము. పసుపులేటి రామారావు గారిలాంటి పెద్దల ఆశీర్వాదాలు మా యూనిట్ కి ఎప్పుడూ ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాము.

సినిమాలు అంటే ప్యాషన్ తో ఈ చిత్రాన్ని నిర్మించాము,మాకు ఈ చిత్ర విజయం తో మాకు సినిమా పట్ల ఉన్న ఇష్టం మరింత పెరిగింది. మంచి సినిమాను తీస్తే మీడియా సపోర్ట్, అలానే ప్రేక్షకుల నుండి ఫ్రెండ్స్ నుండి ఇంత రెస్పాన్స్ వస్తున్నందుకు మాకు చాలా సంతషం గా ఉంది.
ఈ ఆనందం నేను మాటల్లో చెప్పలేను.

మా చిత్రం ఇప్పటికీ థియేటర్స్ సంఖ్య పెరుగుతున్నాయి.ఈ ఆనందాన్ని మీడియాతో పంచుకోడం కోసం మా పాత్రికేయ మిత్రుల సమావేశం ఏర్పాటు చేసాము త్వరలోనే “ఇంతలో ఎన్నెని వింతలో” మూవీ గ్రాండ్ సక్సెస్ మీట్ పెడుతున్నాము. అని తెలియ చేస్తూ మా హరిహర చలనచిత్ర బ్యానర్ లో 2వ ప్రాజెక్ట్ ని కుడా త్వరలో అనౌన్స్ చేస్తాము ఇప్పుడు “ఇంతలో ఎన్నెని వింతలో” సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాము అని చెబుతూ ఒక మీడియా మిత్రుడు మీ బ్యానర్ లో ఎ హీరోలతో సినిమాలు తియ్యాలి అనుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు నవ్వుతూ ఆశ అనుకుంటే శ్రీ విష్ణు అత్యాశ అనుకుంటే బాలయ్య బాబు గారితో అని యువ నిర్మాత రామ్మోహనరావు ఇప్పిలి తెలిపారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

'4 ఇడియట్స్‌' ప్రారంభం
కార్తి, సందీప్‌, చలం, సన్ని హీరోలుగా ప్రియ అగస్టిల్‌, చైత్ర, రుచిర, శశి హీరోయిన్లుగా నాగార్జున సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై శ్రీరంగం సతీశ్‌ కుమార...
తెల్లకాగితంలా థియేటర్‌కి రండి..మంచి సినిమా చూడండి: సుకుమార్
ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న 'రంగస్థలం' రిలీజ్‌ డేట్‌ రానే వచ్చింది. మార్చి 30న ఈ చిత్రం అత్యధిక థియేటర్లలోవరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ కా...
ప్రశ్నిస్తా' సినిమా ప్రారంభం
జనం ఎంటర్టైన్మెంట్ పతాకంపై ప్రముఖనిర్మాత సత్య రెడ్డి నిర్మిస్తున్న 'ప్రశ్నిస్తా' మూవీ కి తన కుమారుడైన మనీష్ బాబు ని హీరోగా పరిచయం చేస్తూ రాజా వన్...
powered by RelatedPosts