శ్రుతిహసన్ పై మండిపడ్డ నిర్మాత..

0

Shruti Haasan New Photos (18)సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల తీరుపై ప్రముఖ నిర్మాత, సినీ ఫైనాన్షియర్ ప్రసాద్ వి పొట్లూరి మండి పడ్డారు. ఇటీవల హీరోయిన్ శృతి హాసన్ ఉన్నట్టుండి తమ సినిమా ప్రాజెక్టు నుండి తప్పుకుని కాంట్రాక్టును ఉల్లంఘించిన నేపథ్యంలో ఆయన అప్ సెట్ అయ్యారు. ఇప్పటి హీరోయిన్లు ‘కాంట్రాక్టు’ పేపర్లను టాయిలెట్ పేపర్లలా ఉపయోగిస్తున్నారంటూ మండి పడ్డారు. నాగార్జున-కార్తి మల్టీ స్టారర్ మూవీ నుండి శృతి హాసన్ ఉన్నట్టుండి తప్పుకున్న నేపథ్యంలో పివిపి సహనం కోల్పోయి ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది. ఇక శృతి హాసన్ స్థానంలో తమన్నాను తీసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ 7, 2015 నుండి షూటింగ్ ప్రారంభం కానుంది. కార్తీ తమన్నలది హిట్ పెయిర్. వీరిద్దరూ కలసి నటించిన పైయ్యా, చిరుదై చిత్రాలు విజయం సాధించాయి. అదే విధంగా తమన్నకు తమిళం, తెలుగు భాషలలో మంచి పేరే ఉంది. తమిళంలో వీరం చిత్రం తరువాత ప్రస్తుతం ఆర్యతో కలసి ఒక చిత్రం చేస్తున్నారు. శృతి చర్యతో తాము తీవ్రంగా నష్టపోయామని పీవీపీ సినిమాస్ సంస్థ కోర్టు కెక్కిన సంగతి తెలిసిందే. వివాదం పరిష్కారమయ్యేంతవరకు కొత్త సినిమాలేవీ అంగీకరించొద్దని కోర్టు శ్రుతి హాసన్ ను ఆదేశించింది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

powered by RelatedPosts