ప్ర‌తిక్ష‌ణం` ప్రీ రిలీజ్ వేడుక 

0
మ‌నీష్ బాబు, తేజ‌శ్విని హీరో, హీరోయిన్ల‌గా, నాగేంద్ర ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ భాగ్య‌ల‌క్ష్మి మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై మ‌ల్లికార్జున రెడ్డి నిర్మించిన చిత్రం ` ప్ర‌తిక్ష‌ణం`. అన్ని ప‌నులు పూర్తిచేసుకుని ఈనెల 18న సినిమా రిలీజ్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో  సోమ‌వారం ఉద‌యం హైద‌రాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జ‌రిగింది. ఆడియో పెద్ద హిట్ అవ్వ‌డంతో ఇదే వేదిక‌పై ప్లాటినం డిస్క్ ఫంక్ష‌న్ కూడా ఘ‌నంగా జ‌రిగింది. `పెళ్ళి చూపులు` చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా తొలి జ్ఞాపిక‌ని చిత్ర నిర్మాత జి.మ‌ల్లికార్జున రెడ్డికి అందించారు.
ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో చిత్ర నిర్మాత మ‌ల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ, ` ర‌ఘురాం సంగీతం అందించిన‌ ఆడియో పెద్ద హిట్ అయింది. సినిమా కూడా పెద్ద విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. ప్ర‌తిక్ష‌ణం అనే టైటిల్ తో ముడిప‌డే క‌థ అంతా సాగుతుంది. టైటిలానే  ప్ర‌తీ స‌న్నివేశాం ఏదో ఒక కొత్త ఫీల్ ఉంటుంది. క‌థనం ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. ఈనెల 18న సినిమా రిలీజ్ చేస్తున్నాం. తెలుగు ప్రేక్ష‌కులంతా త‌ప్ప‌కుండా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాం` అని అన్నారు.
నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ, ` `అనుక్ష‌ణం`, `క్ష‌ణం క్ష‌ణం` సినిమాల్లా ఈ `ప్ర‌తిక్ష‌ణం` చిత్రం కూడా పెద్ద విజ‌యం సాధిస్తుంది. కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమా అయినా ఆడుతుంది. పెద్ద సినిమాలేవి వాటికి పోటీ కాదు. ప్ర‌తిక్ష‌ణంలో పాట‌లు, ట్రైల‌ర్లు బాగున్నాయి. సినిమా పెద్ద విజ‌యం సాధించి నిర్మాత‌కు మంచి లాభాలు తీసుకురావాలి` అని అన్నారు.
చిత్ర హీరో మ‌నీష్ బాబు మాట్లాడుతూ, ` మా నిర్మాత సినిమాల‌పై ఎంతో ఫ్యాష‌న్ తో ఈ రంగంలోకి అడుగు పెట్టారు. మంచి క‌థ‌తో తెర‌కెక్కిన సినిమా ఇది. హార‌ర్ సినిమాల్లో మా చిత్రం ఉన్న‌త స్థానంలో ఉంటుంది. రొటీన్ క‌థ‌ల‌కు కొంచెం  భిన్నంగా తెర‌కెక్కిన చిత్ర‌మిది. ఆడియో పెద్ద హిట్ అయింది. సినిమా కూడా ఆ స్థాయిని చేరుకుంటుంది` అని అన్నారు.
చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు ర‌ఘురాం మాట్లాడుతూ, `నా కెరీర్ ఆరంభంలో వైవిథ్యమైన సంగీతాన్ని అందించే అవ‌కాశం రావ‌డం అదృష్టంగా భావిస్తున్నా.  చక్కని పాట‌లు, మంచి ఆర్ .ఆర్ కుదిరింది` అని అన్నారు.
తుమ్మ‌లప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ, `క‌థ బాగుంటే ఎలాంటి సినిమా అయినా ఆడుతుంది. ఈ సినిమా కూడా పెద్ద విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.
ఈ వేడుక‌లో సాయి వెంక‌ట్, తెలంగాణ రాష్ర్ట డ్ర‌గ్ కంట్రోల‌ర్ అమృత‌రావు, మ‌ల్కాపురం శివ‌కుమార్, నాగులప‌ల్లి ప‌ద్మిని త‌ద‌త‌రులు పాల్గున్నాల‌రు.
ఈ చిత్రానికి సంగీతం: ర‌ఘురాం, ఛాయాగ్ర‌హ‌ణం: క‌ళ్యాణ్ స‌మీ, ఎడిటింగ్:  శివ వై ప్ర‌సాద్, ఆర్ట్: ర‌విచంద్ర‌,  నిర్మాత‌:  జి.మ‌ల్లికార్జున రెడ్డి, క‌థ‌, క‌థ‌నం, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం:  నాగేంద్ర  ప్ర‌సాద్
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
జూన్ 22న ప్ర‌పంచ వ్యాప్తంగా `టిక్ టిక్ టిక్‌` గ్రాండ్ రిలీజ్‌
జ‌యం ర‌వి, నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్లుగా చ‌ద‌ల‌వాడ బ్ర‌ద‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో  శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ బ్యాన‌ర్‌పై శ‌క్తి స...
విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు సినీ టివి డైరి లాంచ్
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ...
powered by RelatedPosts