మూడోసారి మనసు పారేసుకున్న ప్రభు

0

600x450_1340718820_600x450రెండు సార్లు ప్రేమలో “పడటం” వలన, మూడో సారైనా ప్రేమలో “నిలబడడాం” అని గట్టిగా నిశ్చయించుకున్నాడో ఏమో కానీ, ప్రముఖ నృత్య దర్శకుడు- దర్శకుడు ప్రభు దేవా మళ్లీ ప్రేమలో పడ్డట్టు తెలుస్తోంది. బాలీవుడ్ కి సంబంధించిన ఒక పెళ్ళికాని యువనృత్య దర్శకురాలితో ప్రభు గత కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్నాడని, త్వరలోనే వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోబొతున్నారని బాలీవుడ్ కోడై కూస్తోంది.

ప్రభుదేవా మొదట్లో రమలత్ అనే డ్యాన్సర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం విదితమే. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా ప్రభుదేవా, రమలత్ విడాకులు కూడా తీసుకున్నారు. అందుకు కారణం నటి నయనతార అని అప్పట్లో బాగా ప్రచారం కూడా జరిగింది. ప్రభుదేవా నయనతారలు గాఢంగా ప్రేమించుకున్నప్పటికీ పెళ్లి పీటలెక్కలేదు. నయనతార ఆస్తినంతా కర్పూరంలా కరిగించేసాడు…ఆమెకి అన్యాయం చేసేసాడు అని కూడా ప్రభుదేవా పై చాలామంది చాలరకాలుగా చెప్పుకున్నారు . కట్ చేస్తే, ప్రస్తుతం బాలీవుడ్ లో ప్రభుదేవా పేరుమోసిన దర్శకుడు. సూపర్‌హిట్ తెలుగు సినిమాలని చక్కగా హిందీలో రీమేక్ చేస్తూ కోట్లకొద్దీ డబ్బు సంపాదించుకుంటున్నాడు.

ప్రస్తుతం ప్రభు ఏ నృత్యాదర్శకురాలితో ప్రేమలో పడ్డాడు…ఎప్పుడు పెళ్లి చేసుకోబొతున్నాడు అనే వివరాలేవీ ఇప్పటిదాకా బయటకి రాలేదు. ఈ వార్తల్లోని నిజానిజాలేమిటో ప్రభు నోరు మెదిపితే కానీ బయటకి వచ్చేలా లేవు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
అదరగొడుతున్న మాస్ మహారాజా రవితేజ "నేల టిక్కెట్టు" ట్రైలర్‌:
మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, వెటకారపు డైలాగులు ఉంటాయి, మంచి ఎమోషన్...
'ఫ్రీ స్పోర్ట్స్ రిహాబ్ సెంటర్' కి మహేష్ బాబు చేయూత
6 సంవత్సరాలుగా స్లమ్ ప్రాంతాలలో రోజుకి 150 కి పైగా రోగులకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న ఎన్.జీ.ఓ కి మహేష్ బాబు తన సహాయ సహకారాలు అందిస్తున్నా...
powered by RelatedPosts