ఏడాది పొడవునా అటువంటి ఆఫర్లే ..

0

poorna-latest-stills-06c49e01సినిమా రంగంలో ఒక నటుడు లేదా నటి ఒక తరహా పాత్ర చేసి బాగా పేరు సంపాదించుకుంటే, ఆ ఫేమ్ ని క్యాష్ చేసుకునే ఉద్దేశంలో మిగతా దర్శకులు కూడా సదరు నటుడు లేదా నటికి అలాంటి పాత్రలనే మళ్లీ మళ్లీ ఇస్తుంటారు. ఉదా: తాగుబోతు పాత్రలకి ఒకప్పుడు ఎమ్మెస్ నారాయణ లాగా ఇప్పుడు తాగుబోతు రమేశ్. అలాగే సాయి కుమార్ పోలీస్టోరీ హిట్ అయ్యాక…దాదాపు పది సినిమాల్లో వరుసగా సాయికుమార్ కి పోలీస్ వేషాలే వచ్చాయి. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే, ఒక్కసారి ఐటెం సాంగ్ చేస్తే ఇక అంతే. ఇదే విషయం గురించి మళయాళ ముద్దుగుమ్మ మరియు బొడ్దుగుమ్మ పూర్ణ మాట్లాడుతూ,, మళయాళ దర్శకులతో ఈ ఇబ్బంది మేరీయీ ఎక్కువ అంటోంది.

‘ద్రోహి’, ‘విద్దగన్’ చిత్రాల్లో నటించారు పూర్ణ. ఇటీవల ఆమె విలేకరుల తో మాట్లాడారు. తమిళంలో తనకు మెరుగైన పాత్రలు వస్తున్నాయని, అదే విధంగా తెలుగు చిత్రాల్లోనూ అవకాశాలు వస్తున్నట్లు తెలిపారు. తన సినీ ప్రయాణం సంతోషంగా సాగుతోందని, తమిళ, తెలుగు అభిమానులు తనను పక్కింటి అమ్మాయి అనే ఇమేజ్‌తోనే గుర్తిస్తున్నట్లు తెలిపారు. అందుకు కారణం తాను గ్లామర్ రోల్స్‌లో నటించకపోవడమేనన్నారు. అభిమానుల మనసులో అటువంటి ముద్ర సంపాదించుకోవడం సంతోషంగా వుందన్నారు.

మళయాలంలో అనేక మంది నటీమణులు ప్రతిభ కలిగివున్నారని, అయితే మళయాల దర్శకులు మాత్రం వేరే రాష్ట్రాలకు చెందిన తారలను మాత్రం తమ చిత్రాల్లో నటించేందుకు ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. ‘రాజాధిరాజా’ మళయాల చిత్రంలో ఒక పాటకు డ్యాన్స్ చేశానని, వరుసగా అటువంటి ఆఫర్లు వస్తున్నాయన్నారు. పాటల్లో నటించే తారగా పేరు పొందడం ఇష్టం లేకపోవడంతో ఇటువంటి అవకాశాలను తిరస్కరించానన్నారు. మరోసారి ఆ విధంగా డ్యాన్స్ చేసేందుకు సమ్మతిస్తే ఆ ఏడాది పొడవునా అటువంటి ఆఫర్లే ఇస్తారని వాపోయారు పూర్ణ.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
అదరగొడుతున్న మాస్ మహారాజా రవితేజ "నేల టిక్కెట్టు" ట్రైలర్‌:
మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, వెటకారపు డైలాగులు ఉంటాయి, మంచి ఎమోషన్...
powered by RelatedPosts