పవన్‌.. మీరెప్పుడు ముఖ్యమంత్రి అవుతారో చెప్పండి?

0

R.-Narayana-Murthy3”వాళ్లు ముఖ్యమంత్రి అవుతారు, వీళ్లు ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పడం కాదు. మీరెప్పుడు ముఖ్యమంత్రి అవుతారో చెప్పండి” అంటూ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ని ప్రముఖ దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి ప్రశ్నించారు. ‘రేయ్‌’ చిత్రంలోని ‘పవనిజం’ అనే గీతాన్ని మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో నారాయణమూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పైవిధంగా స్పందించారు.
ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ….”చిరంజీవి నలభై ఏళ్ల కంచుకోటను బద్దలుకొట్టి మెగాస్టార్‌ అయ్యారు. ఆయన నీడలో పవన్‌ కల్యాణ్‌ పవన్‌ స్టార్‌గా ఎదిగారు. పవన్‌ కల్యాణ్‌ మానవత్వం ఉన్న వ్యక్తి. ఆయన ప్రజల సమస్యల కోసం రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, పార్టీ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలి. నాకూ ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది. కానీ నేను పార్టీపెట్టలేదు కదా..? పవన్‌ పార్టీ పెట్టారు. అందుకే ఆయన సీఎం అవ్వాలి. రొనాల్డ్‌ రీగన్‌, ఎన్టీఆర్‌, ఎమ్జీఆర్‌లా రాజకీయాల్లోనూ పేరు తెచ్చుకోవాలి”అని పేర్కొన్నారు.
సాయిధరమ్‌తేజ్‌ హీరోగా సయామీఖేర్‌, శ్రద్ధాదాస్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రేయ్‌’. వైవీఎస్‌ చౌదరి స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌పై రూపొందించిన ఓ పాటను ‘రేయ్‌ విత్‌ పవనిజం’ పేరిట విడుదల చేశారు.
ప్రసాద్‌ ల్యాబ్స్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నటుడు ఆర్‌.నారాయణమూర్తి, ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. మార్చి 27న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts