ప.గో లో పవన్ కళ్యాణ్ స్టూడియో?

0

మీరు చదివింది అక్షరాల నిజం అనుకోవచ్చు. ఎందుకంటే సినీ వర్గాల్లో ఎవరిని కదిలించినా ప్రస్తుతం దీని గురించే అందరూ మాట్లాడుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటి అంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో సినీ స్టూడియో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో భూముల ధరలు ఆకాశాన్ని తాకడంతో, ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దల చూపు పక్క జిల్లాలపై పడినట్లు తెలుస్తోంది. అక్కడైతే తమకు కావల్సిన భూములు తక్కువ ధరకు లభిస్తాయని కానుక అటువైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నర్సాపురం- పైడిపాలెం ప్రాంతాల మధ్య స్టూడియో నిర్మించడానికి కావల్సిన భూమిని సేకరించినట్లు తెలుస్తోంది.

ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ముందుగానే మాట్లాడి ఓకే చేయించుకున్నారట. అలాగే రాజధాని పక్క జిల్లాలలో స్టూడియో నిర్మిస్తే అన్నివిధాల అనుమతుల దగ్గర నుంచి రకరకాల ప్రోత్సాహాకాలు లభిస్తాయని పవన్ ముందుగానే ఆలోచించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలలో టిడిపితో కలిసి పవన్ కళ్యాణ్ పనిచేశారు కాబట్టి ఆయనకు ఎన్ని ఎకరాలు కావాలన్న ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభ్యంతరాలు వుండకపోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన స్వంత డబ్బుతోనే స్థలాలను కొనుగోలు చేసి భవిష్యత్త్ లో ఎవరూ వేలెత్తి చూపకుండా వుండే విధంగా స్టూడియో నిర్మించాలని భావిస్తున్నాడు అని సమాచారం.

ప్రస్తుతం బెంగుళూరులో, నడుము నొప్పికి శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి పొందుతున్న పవన్, హైదరాబాద్ కి చేరుకున్నాక తన స్టూడియో గురించి అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts