'గబ్బర్‌సింగ్ 2' ప్రకటన వచ్చేసింది.

0

Pawan Kalyan Latest Trendy Look Photos”నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది” అంటూ చెలరేగిపోయిన ‘గబ్బర్‌సింగ్’ని మర్చిపోవడం అంత తేలికైన విషయం కాదు. పవన్ కల్యాణ్ పలికిన సంభాషణలు, ఆయన చూపించిన తిక్క.. జనాలకు బాగా నచ్చేశాయి. ఆ మత్తులో ఉండగానే… ‘గబ్బర్‌సింగ్ 2’ ప్రకటన వచ్చేసింది. కానీ సెట్స్‌పైకి వెళ్లడానికి కాస్త సమయం పట్టింది. పవన్ కల్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల రెండో ‘గబ్బర్ సింగ్’ కాస్త ఆలస్యమయ్యాడు. అయితే ఇప్పుడు రాజకీయ వేడి కాస్త తగ్గడంతో పవన్ దృష్టి సినిమాలవైపు మళ్లింది. దాంతో ‘గబ్బర్ సింగ్ 2’ హంగామాకు రంగం సిద్ధమైంది. ‘రచ్చ’తో బాక్సాఫీసు దగ్గర సందడి చేసిన సంపత్‌నంది దర్శకత్వం వహించే చిత్రమిది. శరత్‌మరార్ నిర్మాత. ”గబ్బర్ సింగ్ కథకూ.. ఈ కథకూ సంబంధం ఉండదు. కానీ ఆ తిక్క మాత్రం ఉంటుంది. అభిమానులకు రెట్టింపు వినోదం అందిస్తాం. స్క్రిప్టు సిద్ధమైంది. కథానాయిక ఎంపిక జరుగుతోంది. పవన్ పచ్చజెండా వూపగానే చిత్రీకరణను మొదలుపెట్టేస్తాం” అని సంపత్‌నంది చెబుతున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ప‌వ‌న్ టైటిల్ `రాజా వ‌చ్చినాడు`!
పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈచిత్రానికి ...
మెగాస్టార్ 151వ సినిమా `ఉయ్యాలవాడ` మొద‌లైంది
మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చిత్రం నేడు హైద‌రాబాద్ లో మొదలైంది. కొణిదెల ప్రొడక్షన్స్‌ కార్యాలయంలో పూజా కార్యక...
సాయిధరమ్‌తేజ్‌, ఎ.కరుణాకరన్‌ కాంబినేషన్‌లో కె.ఎస్‌.రామారావు భారీ చిత్రం ప్రారంభం
సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాణ సంస్థ క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత కె...
powered by RelatedPosts