పవన్ కి హీరోయిన్ దొరికింది!

0

navneet-dhillon1-385x600
సంపత్ నంది దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించబోయే గబ్బర్ సింగ్ 2 సినిమాకి ఎంతోమంది హీరోయిన్ల పేర్లు పరిశీలనకు వచ్చాయి. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్లందరి పేర్లు వార్తల్లో నిలిచాయి. ఇక ఇప్పుడు ఓ కొత్త అమ్మాయి పవన్ పక్కన నటించబోతున్నది. ఆమె ఎవరో కాదు నవనీత్ కౌర్ దిలాస్. నవనీత్ కౌర్ అంటే గతంలో తెలుగు సినిమాలో నటించిన హీరోయిన్ కాదండోయ్. ఆమె 2013 మిస్ ఇండియా . ఇటీవల సంపత్ నంది ముంబై వెళ్లి ఈ అమ్మాయిని ఆడిషన్స్ చేసి వచ్చాడట. పవన్ పక్కన సరిగ్గా సరిపోతుందనే ఉద్దేశ్యంతో నవనీత్ చేతిలో అడ్వాన్స్ పెట్టి మరీ వచ్చాడట. ఇక ఆ అమ్మాయి దాదాపు ఖరారైనట్లే అని టాలీవుడ్ టాక్. పవన్ తో రోమాన్స్ చేసిన రెండో మిస్ ఇండియా ఈ అమ్మడు. 2007 కి సారా పంజాలో పవన్ సరసన చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ఫ్లాప్. మరి ఈసారైన ఈ మిస్ ఇండియా హిట్ ఇస్తుందో లేదో చూడాలి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్యారిస్ లో ఉన్నారు. అక్కడి నుంచి రాగానే ఓ మై గాడ్ రీమేక్ లో వెంకటేష్ తో కలసి నటించనున్నాడు. ఆ తర్వాత గబ్బర్ సింగ్ 2 లో నటించనున్నాడు పవన్ కళ్యాణ్.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts