ప‌టేల్ స‌ర్ రివ్యూ

0
తారాగ‌ణం: జగపతిబాబు.. పద్మప్రియ.. తాన్య హోప్.. సుబ్బరాజు.. పోసాని కృష్ణ‌ముర‌ళి.. రఘుబాబు.. శుభలేఖ సుధాకర్.. కబీర్ సింగ్.. పృథ్వి.. బేబీ డాలీ తదితరులు.
సంగీతం: వసంత్
ఛాయాగ్రహణం: శ్యామ్ కె.నాయుడు
నిర్మాత: రజిని కొర్రపాటి
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వాసు పరిమి
మాస్టార్స్.కామ్ రేటింగ్: 2.5/5
ముందుమాట‌:
ఇటీవ‌లే జ‌గ‌ప‌తి బాబు హీరో నుంచి క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ట‌ర్న్ అయ్యారు. ప్ర‌స్తుతం కెరీర్ హ్యాపీగా సాగిపోతుంది. విల‌న్ గా మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. అయితే తాజాగా మ‌రోసారి `ప‌టేల్ స‌ర్` తో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఆ సినిమా క‌థా క‌మామీషు ఏంటో ఓసారి చూద్దాం.
క‌థ‌: సుభాష్ ప‌టేల్ (జ‌గ‌ప‌తిబాబు) ఇండియ‌న్ ఆర్మీలో రిటైర్డ్  మేజ‌ర్‌.  కుటుంబం క‌న్నా దేశంపైనే ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. అయితే అనుకోని కొన్ని కార‌ణాల వ‌ల్ల త‌న కుంటుంబాన్ని కోల్పోతాడు. దీంతో మ‌న‌వ‌రాలితో క‌లిసి ఉంటాడు?  అందుకు గ‌ల అస‌లు  కార‌కులు ఎవ‌రు? ప‌టేల్  వాళ్ల‌ను ఎంత క్రూరంగా చంపుతాడు? క‌థ‌లో జ‌గ‌ప‌తిబాబు పాత్ర‌లెన్నో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాల‌సిస్: ఇదొక రివేంజ్ స్టోరీ. తెలుగులో ఇలాంటి క‌థ‌లు ఇప్ప‌టికే చాలా వ‌చ్చేశాయి. మ‌ళ్లీ పాత పాయింట్ నే తీసుకుని కొంచెం కొత్త‌గా చూపించారంతే. ప్ర‌ధ‌మార్థం క‌థ అంతా శ‌త్రువుల‌ను చంప‌డంతోనే ముగుస్తుంది. ఆ యాక్ష‌న్ స‌న్నివేశాలు ష‌రా మాములుగా ఉంటాయి. ఏమాత్రం ఆస‌క్తి క‌ల‌గ‌దు. అయితే ప‌టేల్ స‌ర్ పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు స్టైలిష్ గా క‌నిపించాడు. గ‌తంలో ఎప్పుడూ ఇలాంటి రోల్ పోషించ‌క‌పోవ‌డంతో న్యూ ఫీల్ తీసుకొచ్చాడు. ప్ర‌ధ‌మార్థం అంతా సోసోగా సాగిపోతుంది. ఇక ద్వితియార్థం కోంచె ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది. ద్వితీయార్ధం మొద‌ల‌వ‌డంతోనే సెంటిమెంట్ పండింది. కుటుంబం నేప‌థ్యంలో వ‌చ్చే 20 నిమిషాల స‌న్నివేశాలు కంటత‌డి పెట్టించేలా ఉంటాయి. అప్ప‌టిదాకా ఒక రివేంజ్‌తో కూడిన యాక్ష‌న్ క‌థ అనిపించిన సినిమా, ఉన్న‌ట్టుండి ఓ మంచి కుటుంబ క‌థ‌లా మారిపోతుంది. తొలి స‌గ‌భాగంలో ముగ్గురిని అంతం చేసిన ప‌టేల్‌, ద్వితీయార్ధంలో మ‌రో ఇద్ద‌రిని మ‌ట్టుబెట్టడంతో క‌థ ముగుస్తుంది. ప‌తాక స‌న్నివేశాల్లో ఆస‌క్తిగా అనిపిస్తాయి. క‌థ‌నాన్ని గ్రిప్పింగ్ చెప్పారు. ల్యాగె ఎక్కువ‌గా ఉంది. కొన్ని స‌న్నివేశాల‌ను ట్రిమ్ చేస్తే బాగుండేది. ఓవ‌రాల్ గా ప‌టేల్ సోసోగా సాగిపోతుంది.
న‌టీన‌టులు: సినిమా అంతా జగపతి బాబు వన్ మేన్ షోలా నడిచింది. మిగతా పాత్రలన్నింటికీ స్క్రీన్ టైం చాలా తక్కువ. ముఖ్యంగా లుక్స్ పరంగా జగపతి బాబు సూపర్బ్ అనిపించాడు. తనకు అలవాటైన స్టైలిష్ విలనిజంతో కబీర్ దుహన్ సింగ్ మరోసారి మెప్పించాడు. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన ఆమని, పద్మప్రియ, పృథ్వీలు తమ స్థాయిక తగ్గ నటనతో పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక వ‌ర్గం:  పాత క‌థ‌.  కెమెరా వ‌ర్క్ బాగుంది. యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను ఇంకా పీక్స్ లో చూపించాల్సింది. ఎడిటింగ్ లోపాలున్నాయి. నేప‌థ్యం సంగీతం బాగుంది.
చివ‌రిగా: ప‌ర‌మ రొటీన్ ప‌టేల్
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ప్రభుదేవా `లక్ష్మి` టీజర్ విడుదల
ప్రభుదేవా, ఐశ్వర్య రాజేష్‌ తారాగణంగా ప్రమోద్‌ ఫిలింస్‌, ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై విజయ్‌ దర్శకత్వంలో ప్రతీక్‌ చక్రవర్తి, శృతి నల్లప్ప,...
ఫేమ‌స్ హాలీవుడ్ జంట.. విడాకుల బాట‌!
హాలీవుడ్‌లో మరో జంట పెళ్లి పెటాకులయ్యింది. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న జెనిఫర్ అనిస్టన్, జస్టిన్ థెరోక్స్ విడిపోయారు. 2015 ఆగస్టులో వారిద్దర...
గ్యారెంటీగా 'ఇంటిలిజెంట్‌' సూపర్‌హిట్‌ అవుతుంది: సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌
యాక్షన్‌ అయినా, ఫ్యాక్షన్‌ అయినా.. ఎంటర్‌టైన్‌మెంట్‌ అయినా, ఎమోషన్‌ అయినా ఎలాంటి చిత్రాన్నైనా స్క్రీన్‌పై ఆవిష్కరించి ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేయ...
powered by RelatedPosts