ఈ నెల 28 న ‘పైసా వసూల్’ స్టంపర్ రిలీజ్

0

నందమూరి బాలకృష్ణ – పూరి జగన్నాథ్ ల  సెన్సేషనల్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం పైసా వసూల్‘ . భవ్య క్రియేషన్స్ పతాకం పై వి. ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ  సినిమా షూటింగ్ పూర్తయి ప్రస్తుతం ప్యాచ్ వర్క్ జరుపుకుంటోంది .అది కూడా ఈ వారంలోనే పూర్తి కానుంది .  ఈ నెల 28  పైసా వసూల్‘ కి సంబంధించిన స్టంపర్‘ ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భం గా దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ – “నందమూరి బాలకృష్ణ తో కలిసి ఫస్ట్ టైమ్ ఈ సినిమా చేస్తున్నందుకు చాలా హ్యాపీ గానూగర్వం గానూ ఉంది. నా కెరీర్ లోనే ఇదొక మెమొరబుల్ మూవీ అవుతుంది. బాలకృష్ణ గారు ఈ పాత్ర లో లీనమైన తీరు చూసి వండర్ అయిపోయాను. నందమూరి అభిమానులు కోరుకొనే అంశాలన్నీ ఇందులో పుష్కలంగా ఉంటాయి. డైలాగ్స్సాంగ్స్ అదిరిపోయే లెవెల్ లో ఉంటాయి. ఈ సినిమా ఎలా ఉండబోతోందో రేపు 28 న విడుదల కానున్న స్టంపర్‘ చూస్తే అర్థమవుతుంది. రెగ్యులర్ గా అందరూ విడుదల చేసే టీజర్ ,ట్రైలర్ కి పూర్తి భిన్నం  గా ఈ స్టంపర్‘ ఉంటుంది” అని చెప్పారు.
నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ – ” బాలకృష్ణ -పూరి జగన్నాథ్ ల కాంబినేషన్ లో సినిమా చేసే అవకాశం వచ్చినందుకు చాలా గర్వం గా ఫీల్ అవుతున్నాను . మా భవ్య క్రియేషన్స్ సంస్థ ప్రతిష్టను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే సినిమా అవుతుంది. ఈ వారం తో ప్యాచ్ వర్క్  కంప్లీట్ అవుతుంది.  డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి కావొచ్చాయి  . మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ కూడా చురుగ్గా సాగుతూ ,తుది దశకు చేరుకుంటోంది . ఆడియో ఫంక్షన్ ని త్వరలోనే గ్రాండ్ గా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.nbk 101

fever begins పేరుతో బాలకృష్ణ గారు ఇప్పటివరకూ నటించిన 100 సినిమాల విశేషాల తో ఒక వీడియో కర్టెన్ రైజర్ రిలీజ్ చేసాం . అది సోషల్ మీడియా లో ఇండియా లెవెల్ లో బాగా ట్రెండింగ్ అవుతోంది. ” అని తెలిపారు. శ్రీయ  , ముస్కాన్ కైరా దత్అలీ,పృథ్వి ,పవిత్రా లోకేష్ ,విక్రమ్ జిత్  తదితరులు నటించిన ఈ చిత్రం లో ప్రముఖ హాలీవుడ్ -బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ ఒక ప్రత్యేక పాత్ర ధరించారు .  ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

నాన్న ప్రేమ‌క‌థ‌ల‌న్నింటికంటే భిన్న‌మైన‌ది `మోహ‌బూబా`: ఆకాష్ పూరి
ఆకాష్ పూరి, నేహా శ‌ర్మ జంట‌గా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన `మెహ‌బూబా` మే11న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ సం...
'4 ఇడియట్స్‌' ప్రారంభం
కార్తి, సందీప్‌, చలం, సన్ని హీరోలుగా ప్రియ అగస్టిల్‌, చైత్ర, రుచిర, శశి హీరోయిన్లుగా నాగార్జున సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై శ్రీరంగం సతీశ్‌ కుమార...
తెల్లకాగితంలా థియేటర్‌కి రండి..మంచి సినిమా చూడండి: సుకుమార్
ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న 'రంగస్థలం' రిలీజ్‌ డేట్‌ రానే వచ్చింది. మార్చి 30న ఈ చిత్రం అత్యధిక థియేటర్లలోవరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ కా...
powered by RelatedPosts