పల్నాడు బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ చిత్రం

0

1_16_31_ntr stills in dammu (10)రాయలసీమ ఫ్యాక్షనిజం …సినిమావాళ్లకు చాలా కాలంగా వరంగా ఉంటూ వస్తోంది. సెకండాఫ్ లో హీరో వెళ్లి రాయలసీమ లో ఫ్యాక్షనిస్ట్ లతో పోరాడి…అవసరమనుకుంటే వారిని మార్చేసి వచ్చేస్తూంటాడు. అయితే అది పరమ రొటీన్ అయిపోయింది. అందుకే రకరకాల నేపధ్యాలు వెతుకుతున్నారు దర్శకులు. అందులో భాగంగా…ఇప్పుడు పల్నాడు ముందుకు వచ్చిందని సమాచారం. ఎన్టీఆర్ చేయబోయే చిత్రం పల్నాడు బ్యాక్ డ్రాప్ లో రూపొందనుందని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే…

జూ. ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో తొలిసారిగా ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి ఇప్పటికే ఇండస్ట్రీలో రకరకాల టాక్ లు నడుస్తున్నాయి. సుకుమార్..ఈ సారి ఖచ్చితంగా హిట్ కొట్టడానికి రంగం సిద్దం చేసుకున్నాడని అంటున్నారు. మే నుంచి ప్రారంభమయ్యే ఈ చిత్రం తండ్రి సెంటిమెంట్ ప్రధానంగా,రివేంజ్ తీర్చుకునే విధంగా సాగుతుందని అంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం..సెకంఢాఫ్ మొత్తం పల్నాడులో జరుగుతుందని అంటున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

powered by RelatedPosts