నితిన్‌ హీరోగా కరుణాకరన్‌ చిత్రం

0

nithinనితిన్ కథానాయకుడిగా శ్రేష్ట్ మూవీస్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. మిస్తి కథానాయిక. కరుణాకరన్ దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్ రెడ్డి, నిఖితారెడ్డి నిర్మాతలు. విక్రమ్‌గౌడ్ సమర్పిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి రామ్‌మోహన్‌రావు క్లాప్‌నిచ్చారు. సదానంద్ గౌడ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు మాట్లాడుతూ ”కరుణాకరన్ శైలి ప్రేమకథ ఇది. థ్రిల్లింగ్ అంశాలు చాలా ఉంటాయి. జూన్ 2 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాం. విదేశాల్లోనూ కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తాం. ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ చిత్రాల తర్వాత మా సంస్థలో రూపుదిద్దుకొంటున్న సినిమా ఇది. తప్పకుండా మరో విజయం సొంతం చేసుకొంటాం” అన్నారు. ఈ చిత్రానికి మాటలు: హర్షవర్ధన్, కథావిస్తరణ: ముకుంద్ పాండే కళ: రాజీవ్ నాయర్, సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: ఆండ్రూ.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
అదరగొడుతున్న మాస్ మహారాజా రవితేజ "నేల టిక్కెట్టు" ట్రైలర్‌:
మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, వెటకారపు డైలాగులు ఉంటాయి, మంచి ఎమోషన్...
'ఫ్రీ స్పోర్ట్స్ రిహాబ్ సెంటర్' కి మహేష్ బాబు చేయూత
6 సంవత్సరాలుగా స్లమ్ ప్రాంతాలలో రోజుకి 150 కి పైగా రోగులకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న ఎన్.జీ.ఓ కి మహేష్ బాబు తన సహాయ సహకారాలు అందిస్తున్నా...
powered by RelatedPosts