రాణాతో ఫోటో దిగడం ఇప్పుడు చాలా ఈజీ !!

0

Rana latest pic

స్టార్లతో ఫోటోలు దిగడానికి సగటు సినిమా అభిమానులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కానీ.. ఇకపై స్టార్ హీరోతో ఫోటో దిగడం సులభతరం చేసింది యాప్ స్టర్. “నేనే రాజు నేనే మంత్రి” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. “యాప్ స్టర్” అనే యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని మల్టీప్లెక్స్ లో పెట్టిన ఏదైనా “నేనే రాజు నేనే మంత్రి” ఫ్లెక్స్ దగ్గరకెళ్లి.. సదరు ఫ్లెక్సీ స్టాండ్ పై ఉన్న కోడ్ ను స్కాన్ చేస్తే.. రాణావి కొన్ని ఫోజులు ఆగుమెంటెడ్ రియాలిటీలో మొబైల్ ఫోన్ లో కనిపిస్తాయి. రాణా ఫోజ్ కి తగ్గట్లుగా నిల్చోని నిజంగా రాణాతో ఫోటో దిగినట్లుగా ఔట్ పుట్ వస్తుంది. ఫోటో చూస్తే నిజంగా రాణాతో ఫోటో దిగినట్లే ఉంటుంది.
ఈ ఆగుమెంటెడ్ రియాలిటీతో “నేనే రాజు నేనే మంత్రి” ప్రమోషన్స్ లో సరికొత్త ట్రెండ్ మొదలైంది.
ఈ లేటెస్ట్ ట్రెండింగ్ ప్రమోషన్ కు సంబంధించిన ప్రెస్ మీట్ ను నేడు హైద్రాబాద్ లో బ్లూ ప్లానెట్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేతలు భరత్ చౌదరి-వి.కిరణ్ రెడ్డిలతోపాటు సురేష్ బాబు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మొట్టమొదటిగా ఈ ఆగుమెంటెడ్ రియాలిటీతో రాణాతో ఫోటో దిగారు.
ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న “నేనే రాజు నేనే మంత్రి”లో రాణా సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించగా.. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత సారధ్యం వహించారు!

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు సినీ టివి డైరి లాంచ్
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ...
టెల్ మీ బాస్ పిక్చర్స్ 'కుమార్ రాజా` కొత్త చిత్రం ప్రారంభం
Tellmeboss Pictures పతాకంపై నిర్మాత శ్రీచక్ర మల్లికార్జున తన స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తొలిచిత్రం ‘కుమార్ రాజా’ చిత్ర...
powered by RelatedPosts