నేనే రాజు నేనే మంత్రి రివ్యూ

0
జానర్ : పొలిటికల్ థ్రిల్లర్
తారాగణం : రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్, కేథరిన్ థెరిస్సా, శివాజీ రాజా, తనికెళ్ల భరణి, నవదీప్
సంగీతం : అనూప్ రుబెన్స్
దర్శకత్వం : తేజ
నిర్మాతలు : సురేష్ బాబు, కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి
మాస్టార్స్.కామ్ రేటింగ్ 3/5
ముందుమాట‌: డైన‌మిక్ హీరో రానా కి `బాహుబ‌లి-2` త‌ర్వాత ఇమేజ్ మ‌రింత పెరిగింది. దీంతో అత‌ని సినిమాల‌పై కూడా అంచ‌నాలు భారీగానే నెల‌కొన్నాయి. తాజాగా ఆయ‌న క‌థానాయ‌కుడిగా తేజ ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కిన `నేనే రాజు నేనే మంత్రి`  సినిమా నేడు రిలీజ్ అయింది. ఆ సినిమా క‌థా కామామీషు ఏంటో ఓసారి చూద్దాం.
క‌థ‌: జోగేంద్ర(రానా దగ్గుబాటి)కి తన భార్య రాధ(కాజల్) అంటే ప్రాణం. వడ్డీ వ్యాపారం చేస్తూ బతికే జోగేంద్రకు  భార్య, మామ తప్ప మరో ప్రపంచం తెలీదు. తాకట్టు లేకుండా అప్పు ఇవ్వకపోవటం జోగేంద్ర అలవాటు.. ఎదుటి మనిషి కష్టాల్లో ఉంటే ఏ మాత్రం ఆలోచించకుండా ఆదుకోవటం రాధకు అలవాటు. పెళ్లైన మూడేళ్ల తరువాత రాధ గర్భవతి అవుతుంది. కానీ ఆనందం వారి జీవితంలో ఎంతో సేపు నిలబడదు. ఊరి సర్పంచ్ భార్యతో జరిగిన గొడవలో రాధ కడుపులో బిడ్డ చనిపోతుంది. అదే జోగేంద్ర కెరీర్ ను ట‌ర్న్ చేస్తుంది. వడ్డీ వ్యాపారి అయినా రానా అక్క‌డ నుంచి రాజ‌కీయాల‌లోకి ఎలా వెళ్లాడు?  అత‌ను మంత్రి అవ్వ‌డానికి తీసుకున్న నిర్ణ‌యాలు ఏంటి?  మంత్రి అయిన త‌ర్వాత ప్ర‌జ‌లు చేసిన సేవ‌లేంటి? క‌్యాథ‌రీన్ (దేవికా) తో జోగ్రేంద్ర రిలీష‌న్ ఎలాంటిది? అన్న అంశాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాల‌సిస్: ఎప్పుడూ కొత్త వాళ్ల‌తో ల‌వ్ స్టోరీలు తెర‌కెక్కించే తేజ ఒక్క‌సారిగా రూట్ మార్చి రానా ను టార్గెట్ చేసి సినిమా  చేశాడ‌ని కామ‌న్ జ‌నాల నుంచి టాలీవుడ్ ఇండ‌స్ర్టీ వ‌ర‌కూ మాట్లాడుకున్నారు. పైగా ఓ పోలిటిక‌ల్ స్టోరీని ఎంచుకున్నాడు?  తేజ ఇలాంటి క‌థ‌ల‌ను డీల్ చేయ‌గ‌ల‌డా? అనే ఎన్నో సందేహాలు త‌లెత్తాయి. అయితే సినిమా కోసం తేజ ఎంత క‌ష్ట‌ప‌డ్డాటో సినిమా చూస్తేనే తెలుస్తుంది. మొద‌టి నుంచి రానా క‌థ‌ల విష‌యంలో సెల‌క్టివ్ గానే ఉంటున్నాడు. అందుకే తేజ  చెప్పిన క‌థ‌కు బాగా క‌నెక్ట్ అయి ఉండొచ్చు. రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కించిన ఈ పొలిటికల్ క‌థ చాలా కొత్త ఫీల్ ను ఇస్తుంది. పిల్ల‌లు లేర‌న్న బాధ‌…పెళ్లంపై ఉన్న ఇష్టం కార‌ణంగా ఎంతకైనా తెగించే జోగేంద్ర పాత్ర‌ను చ‌క్క‌గా డిజైన్ చేశాడు.  ప్ర‌ధ‌మార్థం క‌థ‌లో రానా ఇన్నోసెంట్ గా క‌నిపించే స‌న్నివేశాల్లో అద‌ర‌గొట్టాడు. అత‌ని ఆహార్యం..న‌ట‌న చాలా కొత్త‌గా ఉంది. ముఖ్యంగా సామెత‌లతో ముడిపెట్టి రాసిన డైలాగ్ లు భ‌లే పెలాయి. జోగేంద్ర వాడే మైండ్ గేమ్ బాగుంది. కాజ‌ల్ పాత్ర కు మంచి వెయిట్ ఉంది. భార్య పాత్ర‌లో ఒదిగిపోయింది. ఇంట‌ర్వెల్ బ్యాంగ్ స‌న్నివేశాలు బాగా క‌నెక్ట్ అయ్యాయి. ఇక ద్వితియార్థం నుంచి క‌థ రివేంజ్ లోకి వెళ్తుంది. ప్రత్య‌ర్ధిని  ప‌డ‌గొట్టి  కుర్చీ ఎక్క‌డం కోసం జోగేంద్ర వేసిన స్కెచ్ సీన్స్ బాగున్నాయి. కేథ‌రీన్ కు మంచి పాత్ర ప‌డింది.  భ‌ర్త డ్రీమ్ కోసం భార్య ప్రాణ త్యాగం… భార్య లేని లోకంలో భ‌ర్త జీవించ‌క ఆత్మ హ‌త్య చేసుకోవ‌డం చాలా కొత్త‌గా అనిపించింది. తెలుగు సినిమాలో  హీరో, హీరోయిన్లు చ‌నిపోయిన ఈ మ‌ధ్య కాలంలో ఇదే అవ్వొచ్చు. ఒకానొక ద‌శ‌లో ఈ సినిమా తేజ నే తీశాడా? అనిపిస్తుంది. తొలిసారి తేజ పొలిటిక‌ల్..స‌మాజం అంటూ సినిమా చేయ‌డంతో అలాంటి సందేహం క‌ల్గుతుంది. ఓవ‌రాల్ గా తేజ త‌న క్రియేటివిటీలో రెండ‌వ కోణాన్ని బ‌య‌టకు తీసాడు.
న‌టీన‌టులు:  రానా న‌ట‌న బాగుంది. ఒకే పాత్ర‌లో డిఫ‌రెంట్ వేరియేష‌న్స్ ను చ‌క్క‌గా చూపించాడు. కాజ‌ల్ న‌ట‌న బాగుంది. ఇందులో ఆమెకు మంచి రోల్ దొరికింది. క్యాథ‌రీన్ కు క్యారెక్ట‌ర్ బాగుంది. మిగ‌తా పాత్ర‌లు చ‌క్క‌గా ఉన్నాయి.
సాంకేతివ‌ర్గం: క‌థ బాగుంది. పాత క‌థే అయినా కొత్త హంగుల‌తో తెర‌కెక్కింది. మాట‌లు హైలైట్. కెమెరా వ‌ర్క్ బాగుంది. పాట‌లు, నేప‌థ్య సంగీతం బాగున్నాయి. అక్క‌డ‌క్క‌డా ఎడిటింగ్ లోపాలున్నాయి. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.
చివ‌రిగా: రానా న‌ట‌న‌..తేజ రెండ‌వ కోణం అదిరాయి
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

క్రియేటివ్ డైరెక్ట‌ర్ తో రానా!
యంగ్ హీరో రానా మరోక్రేజీ ప్రాజెక్ట్‌కు ఒకే చెప్పాడ‌ని స‌మాచారం. ప్రస్తుతం 1945, హాథీ మేరీ సాథీ, రాజా మార్తండ వర్మ సినిమా షూటింగ్ ల‌తో రానా బిజీగా...
ఇంద్ర‌`లో బాల‌న‌టుడు తేజ హీరో అయ్యాడు
`చూడాల‌ని ఉంది`, `ఇంద్ర‌` చిత్రాల్లో న‌టించిన‌ బాల‌న‌టుడు తేజ గుర్తున్నాడు క‌దా? .. మ‌హేష్ `యువ‌రాజు` మూవీలోనూ బాల‌కుడిగా అల‌రించాడు. ఈ కుర్ర...
స్టార్ హీరోని టార్గెట్ చేసిన తేజ‌!
`నేనే రాజు నేనే మంత్రి` సినిమా స‌క్సెస్ తో తేజ మ‌ళ్లీ బ్యాక్ బౌన్స్ అయ్యాడు. డైరెక్ట‌ర్ గా ప‌ట్టాలు త‌ప్పి పోయినా బండిని ఒక్క హిట్ తో మ‌ళ్లీ ట్...
powered by RelatedPosts