Nela Ticket movie review

0

Nela Ticket Review: అమ్మ చేతి ముద్దపప్పు ఆవకాయ ఎంత బాగుంటుందో కదా. అమ్మ ప్రతి రొజూ అదే చేసినా ఆనందంగా తింటాం, ఎందుకు అంటే అది ముద్దపప్పు ఆవకాయ రుచికి ఉన్న లక్షణం. మన మాస్ మహారాజా రవితేజ సినిమాలు కూడా అంతే. అయన స్టైల్‌లో ఉండే కామెడీ, యాక్షన్ ఎప్పుడూ బోర్ కొట్టవు. సరదాగా, వెటకారంగా అయన చేసే నటన నచ్చనివారు ఉండరు. కొన్ని సార్లు కథ బాలేకనో, లేక కథనం బాలేకనో ఆయన సినిమాలు ఫ్లాప్ అయ్యి ఉండొచ్చు కానీ రవితేజ తన నటనతో ఎప్పుడూ నిరాశపరచలేదు.
అలాంటి గొప్ప నటనతో మళ్ళీ మన ముందుకు “నేల టిక్కెట్టు” సినిమాతో వచ్చాడు మాస్ మహారాజా రవితేజ. ఇవ్వాళ విడుదల అయినా ఈ సినిమా రివ్యూ మీ కోసం:
కథ: అనాథను అయితే ఏంటి ప్రపంచమంతా నా కుటుంబమే అనుకునే ఒక వ్యక్తి. ఆ కుటుంబం కోసం ఎక్కడికయినా వెళ్లి ఎవ్వరితోనైనా పోరాడగలిగే వ్యక్తి కథ ఈ సినిమా.
నటన: ఇంత మంచి కథకు తగ్గట్టే రవితేజ కూడా తన నటనతో అదరగొట్టాడు. కామెడీ, మాస్ సీన్లలో ఎంత బాగా చేసాడో సెంటిమెంట్ సీన్లలో కూడా అంతే బాగా చేశాడు. ముఖ్యంగా ముసలి వాళ్ళతో, ఎల్బీ శ్రీరాం, అన్నపూర్ణమ్మలతో ఉన్న సీన్లలో అయితే మనకి కన్నీళ్ళు తెప్పించేస్తాడు.
జగపతిబాబు విలన్‌గా మరోసారి అదరగొట్టాడు. ఆ క్యారెక్టరుకి అయన తప్ప మరొకరు సరిపోరు అనేంత బాగా చేశారు. సినిమా మొత్తం హీరో, విలన్ మధ్య జరిగే కథ కావడంతో హీరోయిన్ కొత్త అమ్మాయి మల్వికా శర్మకి పెద్దగా సీన్లు లేవు. కానీ ఉన్నంతలో చాలా బాగా చేసింది. క్యూట్‌గా, లవ్లీగా రవితేజ సరసన చాలా బాగా చేసింది. చాలా రోజుల తరువాత సీనియర్ నటుడు శరత్ బాబు గారిని ఈ సినిమాలో మనం మంచి రోల్‌లో చూడగలుగుతాం. మిగతా అందరూ కూడా బాగా చేశారు.
ప్లస్ పాయింట్స్:
  • మంచి కథ
  • రవితేజ నటన
  • హార్ట్ టచింగ్ డైలాగ్స్
  • సినిమాటోగ్రఫీ
  • డిఫరెంట్ సాంగ్స్ & బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్
  • సెంటిమెంటల్ క్లైమాక్స్
మైనస్ పాయింట్స్:
  • స్క్రీన్ ప్లే కొద్దిగా బాగుండాల్సింది.
  • ఎడిటింగ్ – అక్కడక్కడా కొన్ని సీన్లు తీసేసి ఉంటే సినిమా ఇంకా బాగుండేది.
  • హీరో – హీరోయిన్ సీన్లు ఇంకా కొన్ని పెట్టాల్సింది.
ఓవరాల్: అక్కడక్కడా కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నా కూడా మొత్తంగా సినిమా చూడటానికి బాగుంది. ముఖ్యంగా డైలాగులు, సెకండ్ హాఫ్‌లో సెంటిమెంట్ ఫ్యామిలీ ఆడియన్సుకి బాగా నచ్చుతుంది.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు సినీ టివి డైరి లాంచ్
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ...
టెల్ మీ బాస్ పిక్చర్స్ 'కుమార్ రాజా` కొత్త చిత్రం ప్రారంభం
Tellmeboss Pictures పతాకంపై నిర్మాత శ్రీచక్ర మల్లికార్జున తన స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తొలిచిత్రం ‘కుమార్ రాజా’ చిత్ర...
powered by RelatedPosts