బన్నీకి సై అన్న నయన్?

0

Nayanatara-1121376653250కొన్ని కాంబినేషన్లు చూడటానికి తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పుడూ ఆతృతగా ఎదురుచూస్తారు. అలాగే కొన్ని కాంబినేషన్లని ఊహించుకోవడం చాలా కష్టం. ఆ కోవకే చెందుతుంది అల్లు అర్జున్ – నయనతార కాంబినేషన్. అల్లుఅర్జున్ నయనతారల కాంబినేషన్ ఊహించుకోవడం కష్టమే. ఎందుకంటే, ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ టాప్ హీరోలతో నటించిన నయనతార అల్లుఅర్జున్ తో నటిస్తోంది అనే వార్తలు హడావిడి చేస్తున్నాయి.

ఇప్పటికే ప్రారంభం కావలసిన బన్నీ, త్రివిక్రమ్ ల సినిమా రకరకాల కారణాలతో ఆలస్యం జరిగిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు వీరిద్దరి కాంబినేషన్ కధకు లైన్ క్లియర్ కావడంతో ఈ సినిమాలో నటించబోయే ముగ్గురు హీరోయిన్ల ఎంపిక పని త్రివిక్రమ్ మొదలు పెట్టాడు అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సమంత ఒక హీరోయిన్ గా ఎంపిక అయిన ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నయనతారను ఎంపిక చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన త్రివిక్రమ్ కు కలిగింది అని ఫిలింనగర్ టాక్.

ఇప్పటికే నయనతార అటు సీనియర్ హీరోలతో ఇటు యంగ్ హీరోలతో నటించేస్తూ దుమ్ము దులిపెస్తున్న నేపధ్యంలో అనుకోకుండా త్రివిక్రమ్ నుండి వచ్చిన ఆఫర్ కు నయన్ ఆలోచిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు నయనతార టాలీవుడ్ లో చాలామంది హీరోలతో నటించినా ఇంతకు వచ్చి మెగా కుటుంబ యంగ్ హీరోలతో నటించిన సందర్భం గతంలో లేదు. అందువల్లనే నయన్ బన్నీతో నటిస్తే ఆ సినిమాకు ఒక కొత్త క్రేజ్ ఏర్పడుతుంది. ఈ విషయాలు ఆలోచించి త్రివిక్రమ్ నయనతారకు ఈ ప్రపోజల్ ఇచ్చి ఉంటాడు అని అనుకోవాలి. కానీ నయన్ సమాధానం ఏమిటి అన్న విషయం పై సస్పెన్స్ కొనసాగుతోంది అని ఫిలింనగర్ రూమర్.

అయినా నయన్- బన్నీ తెర మీద మరీ అక్కా-తమ్ముడిలా కనిపిస్తారేమో అని చాలామంది బన్నీ ఫ్యాన్స్ బెంగ పెట్టుకున్నట్టు వినికిడి. చూడాలి మరి ఏమవుతుందో.?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts