రెండు రోజులు కాల్‌షీట్స్ ఖరీదు నాలుగు కోట్లు..

0

Nayanatara-iపట్టువిడుపుల గురించి నటి నయనతారనే అడిగి తెలుసుకోవాలి. ఈ విషయంలో ఆమెకు మించిన జాణ లేరనిపిస్తోంది. అందుకే నయనతార వ్యక్తిగతంగా ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నా వృత్తిపరంగా టాప్ హీరోయిన్‌గానే వెలుగొందుతున్నారు. అసలు విషయం ఏమిటంటే ఈ కేరళకుట్టి ప్రస్తుతం పుచ్చుకుంటున్న పారితోషికం రెండు కోట్లుపైనే అని కోలీవుడ్ టాక్. ఇటీవల నటించిన నన్బేండా చిత్రం కోసం ఆ చిత్రం కథానాయకుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ నయనతార కు రెండున్నర కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఆమె చాలా కాలం తరువాత మాతృభాషలో మమ్ముట్టి సరసన ఒక చిత్రం చేశారు.

ఆ చిత్రానికి నయనతార తీసుకున్న పారితోషికం కేవలం 50 లక్షలేనట. అలా సొంత గడ్డపై చేసిన చిత్రం కోసం అంత ఉదార స్వభావం చూపిన మలయాళి భామ సమీపంలో ఒక వాణిజ్య ప్రకటనలో నటించడానికి రెండు రోజులు కాల్‌షీట్స్ కోసం డిమాండ్ చేసిన పారితోషికం ఎంతో తెలుసా? అక్షరాల నాలుగుకోట్లు అని సమాచారం.

మరో విషయం ఏమిటంటే తన తరువాత అనుష్క, సమంత, శ్రుతిహాసన్, కాజల్ అగర్వాల్, ఎమిజాక్సన్ హీరోయిన్లు వచ్చినా నయనతార నక్షత్ర అంతస్థు ఏ మాత్రం తగ్గలేదు. సుమారు రెండేళ్లు నటనకు గ్యాప్ ఇచ్చి రీఎంట్రీ అయినా తన పూర్వస్థానాన్ని పదిలపరచుకున్న నటి ఎవరైనా కోలీవుడ్‌లో ఉన్నారంటే అది నయనతారనే. ఆ సంచలన నటి చిత్ర చిత్రానికి 30 లక్షలు పారితోషికం పెంచుకుంటూ పోతున్నారన్నది కోలీవుడ్ టాక్.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

న‌య‌న్-శివ‌న్ పెళ్లి షురూ అయిందా?
న‌య‌న‌తార-డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్ డీప్ ల‌వ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రూ పెళ్లి చేసుకుంటార‌ని చాలా రోజుల నుంచి వార్త‌లు కూడా వ‌స్తున్నాయి...
Nayantara Joins #NBK102 Shooting in Hyderabad
Nandamuri Balakrishna is continuing the winning touch for his 102nd film #NBK102 in KS Ravikumar direction by roping in Nayantara as heroine....
న‌ట‌సింహ స‌ర‌స‌న ముగ్గురు భామ‌లు
నందమూరి న‌ట‌సింహ బాలకృష్ణ 102వ చిత్రం నిన్న  ప్రారంభమైన సంగతి తెల్సిందే. ప్రముఖ దర్శకుడు కె.ఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యొక్క ర...
powered by RelatedPosts