నయన ప్రస్తుతం మార్చింది

0

Nayantara-Cute-Picsరెండేళ్ల క్రితం ఫీమేల్-సెంట్రిక్ సినిమాలపై ఇంట్రెస్ట్ లేదన్న నయన ప్రస్తుతం మాట మార్చింది. శేఖర్ కమ్ముల అనామికతో బిజీ అయిన నయన తార మాయ లాంటి లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది. ఇంకా లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నయన నటిస్తూ.. ప్రస్తుతం ఫీమేల్ సెంట్రిక్ మూవీలు ఎక్కువయ్యాయని.. వాటిపై తాను కూడా దృష్టి పెట్టానని చెప్పుకొచ్చింది.

అనుష్క రుద్రమదేవి, అంజలి చిత్రంగద వంటి సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభిస్తున్న తరుణంలో.. నయన కూడా లేడి ఓరియెంటెడ్ బాటలో పయనిస్తే ఎలాంటి ఆఫర్లు వస్తాయని ప్రేక్షకులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. కాగా.. ప్రభుదేవా కటీఫ్ అయ్యాక నయనతారకు కోలీవుడ్, టాలీవుడ్‌లో భారీ ఆఫర్లు వస్తున్నాయి. తెలుగులో బాలయ్యతో కొత్త సినిమా చేసేందుకు నయన రెడీ కాగా, తమిళంలో ఉదయనిధి మారన్‌తో నటించిన నన్బేండాలో నయన నటించింది. ఈ సినిమాకు రివ్యూ రిపోర్ట్ అదుర్స్ అనిపించింది.

ఇక శింబుతో నయన నటించిన ఇదు నమ్మ ఆళు సినిమా కోసం ప్రేక్షకులు వేయి కనులతో ఎదురుచూస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు.. నయన మాజీ ప్రేమికుడు శింబుతో కలిసి నటించే సినిమా ఎలా ఉంటుందోనని ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

powered by RelatedPosts