క‌థే మ‌ళ్లీ న‌న్ను పోలీసోణ్ణి చేసింది: య‌ంగ్ హీరో నారా రోహిత్!

0

Nara Rohit latest

టాలీవుడ్ లో ఇన్నోవేటివ్ థాట్స్ ను ఎంక‌రేజ్ చేసే ఎకైక హీరో నారా రోహిత్. తొలి సినిమా `బాణం` నుంచి మొన్న‌టి `అప్ప‌ట్లో ఒక‌డుండే వాడు` వ‌ర‌కూ అన్నీ వేటిక‌వే ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న చిత్రాలే. ముఖ్యంగా ఆయ‌న ఎంపిక చేసుకునే క‌థ‌ల్లో డ్రామా అనేది కామ‌న్ పాయింట్. అదే అత‌ని స‌క్సెస్ సీక్రెట్ కూడా. క‌మ‌ర్శియ‌ల్ గా ఆ సినిమా ఫ‌లితాలు ఎలా ఉన్న‌ప్ప‌టికీ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మై గుర్తింపు ద‌క్కిందంటే కార‌ణం ద‌ర్శ‌కుల ఇన్నో వేటివ్ థాట్సే ను ఎంక‌రేజ్ చేయ‌డ‌మే! మ‌రో విశేషం ఏంటంటే ఇక్క‌డ ఆయ‌న మైండ్ సెట్ కు ద‌గ్గ‌ర‌గా ఆలోచించే ద‌ర్శ‌కులు ల‌క్కీగా ఆయ‌న‌కు కుద‌ర‌డం. అలాంటి ఇన్నో వేటివ్ థాట్ తోనే యంగ్ డైరెక్ట‌ర్ శ్రీరామ్ ఆదిత్య `మ‌ర‌క‌త‌మ‌ణి` చిత్రాన్ని తెర‌కెక్కించాడు. హైద‌రాబాద్ నోవోటాల్ ద‌గ్గ‌ర కారు మిస్సింగ్ ను బేస్ పాయింట్ గా తీసుకుని దానికి త‌న‌దైన క్రియేటివిటీ తో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించాడు. భారీ కాన్వాస్ తో న‌లుగురు యంగ్ హీరోలు ఆది, సందీప్ కిషన్, నారా రోహిత్, సుదీర్ బాబుల‌ను ఒకే ప్రేమ్ లో చూపిస్తూ భవ్య క్రియేషన్స్‌ బ్యానర్‌పై వి. ఆనంద్ ప్ర‌సాద్ నిర్మించిన ఈ సినిమా జులై 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం ఉద‌యం నారా రోహిత్ కాసేపు పాత్రికేయుల‌తో ముచ్చ‌టించారు. ఆ విశేషాలు….

**’శమంతకమణిస‌ ఓబ్యూట్ ఫుల్ జ‌ర్నీ. సాధారణంగా నలుగురు హీరోలు కలిసి ఒకే సినిమా చేయ‌డం చిన్న విష‌యం కాదు. క‌థే హీరోల‌ను మౌల్డ్ చేస్తే త‌ప్ప అలాంటి రేర్ కాంబినేష‌న్స్ అంత ఈజీగా సెట్ కావు. లక్కీగా ‘శమంతకమణిస తో మా క‌ల‌యిక అలా కుదిరింది. నాలుగు పాత్ర‌లు హైలైట్ గా ఉంటాయి.

** ఇందులో నా పాత్ర పేరు రంజిత్‌కుమార్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర అది. ఇప్ప‌టివ‌రుసుగా నాలుగు సినిమాల్లో పోలీస్ పాత్ర‌లే చేశాను. మళ్ళీ పోలీస్ పాత్ర ఏంట‌ని కొంచెం డైల‌మాలో ప‌డ్డా. కానీ క‌థ విన్నాక డైలామా తొల‌గిపోయి పాత్ర పై ఇష్టం..ఫ్యాష‌న్ పెరిగింది. అందుకే మ‌ళ్లీ పోలీస్ గెట‌ప్ వేసా. గతంలో నేను చేసిన పోలీస్‌ పాత్రలకు భిన్నంగా ఉంటుంది ఈ పాత్ర‌. క్రాంకీ తరహా పోలీస్‌ ఆఫీసర్‌ అంటే ఎప్పుడు సీరియస్‌గా ఉంటాడు? ఎప్పుడు నవ్విస్తాడు? అనే విషయం ఎవరికీ తెలియదు. అదే నా పాత్ర‌లో స్పెషాలిటీ.

**నలుగురు హీరోలతో ఇంత పెద్ద సినిమాను దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య 37 రోజుల్లో పూర్తి చేశాడంటే తనకెంత క్లారిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. అద్భుతమైన స్క్రిప్ట్‌ను రాబట్టుకున్నాడు. ఏ క్యారెక్టర్‌ నుండి ఏం కావాలి, ఎలా రాబట్టుకోవాలనే విషయం బాగా తెలుసు.

** పవన్‌ మల్లెల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కోసం బరువు తగ్గాను. ఇప్పటికి 21 కిలోల బరువు తగ్గాను. ఈ సినిమాలో నాలుక్‌ను నా పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నాం.

**కథలో రాజకుమారి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. నేను, సుధీర్‌బాబు కలిసి ‘వీరభోగ వసంతరాయులు’ సినిమా చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను చేయని కాన్సెప్ట్‌లో ఉండే మూవీ ఇది. తెలుగులో కమల్‌హాసన్‌ ‘ఈనాడు’ తరహాలో సాగే చిత్రమిది.ఈ చిత్రంలో సుధీర్‌గారు పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తుంటే, నేను ఇంటెలిజెంట్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నాను. పవన్‌ మల్లెల సినిమా సిద్ధమవుతుంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు సినీ టివి డైరి లాంచ్
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ...
టెల్ మీ బాస్ పిక్చర్స్ 'కుమార్ రాజా` కొత్త చిత్రం ప్రారంభం
Tellmeboss Pictures పతాకంపై నిర్మాత శ్రీచక్ర మల్లికార్జున తన స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తొలిచిత్రం ‘కుమార్ రాజా’ చిత్ర...
powered by RelatedPosts