హిందీలోకి నాని సినిమా ..

0

Yevade Subramanyam Press Meet Photos (5)నాని హీరోగా రూపొందిన ‘ఎవడే సబ్రమణ్యం’ చిత్రం ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ పొందుతూ విజయవంతంగా ముందుకు దూసుకెళుతోంది. ఈ చిత్రంపై బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాత దృష్టి పడిందట. ఇలాంటి కాన్సెఫ్ట్ లతో రూపొందిన సినిమాలకు బాలీవుడ్ లో మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్న బాలీవుడ్ నిర్మాత ఈ చిత్రం హక్కులు పొందడానికి ట్రై చేస్తున్నారని తెలుస్తోంది.

ఇటీవలే ‘ఎవడే సుబ్రమణ్యం’ నిర్మాత ప్రియా దత్ తో సదురు బాలీవుడ్ నిర్మాత చర్చలు జరిపారని వినికిడి. హిందీ రీమేక్ రైట్స్ కోసం ప్రియా దత్ భారీగా డిమాండ్ చేసిందట. ప్రస్తుతం దీనికి సంబంధించే చర్చలు జరుగుతున్నాయని, ప్రియా దత్ డిమాండ్ ని బాలీవుడ్ నిర్మాత అంగీకరించే అవకాశముందని ఫిల్మ్ నగర్ సమాచారమ్. మరో రెండు రోజుల్లో ఫైనలైజ్ అయ్యే అవకాశముందని వినికిడి. అన్ని ఫైనలైజ్ అయితే హిందీ రీమేక్ లో నటించబోయే హీరో ఎవరో?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

powered by RelatedPosts