న‌క్ష‌త్రం రివ్యూ

0

న‌టీన‌టులు: స‌ందీప్‌కిష‌న్‌.. సాయిధ‌ర‌మ్ తేజ్‌.. రెజీనా.. ప్ర‌గ్యా జైశ్వాల్‌.. త‌నీష్‌.. తుల‌సి.. ప్ర‌కాష్‌రాజ్.. జె.డి.చక్ర‌వ‌ర్తి.. ర‌ఘుబాబు.. బ్ర‌హ్మాజీ.. శివాజీరాజా.. వైవా హ‌ర్ష త‌దిత‌రులు.
కూర్పు: శివ‌.వై.ప్ర‌సాద్‌
సంగీతం: భీమ్స్‌.. హ‌రిగౌర‌వ‌.. భ‌ర‌త్ మ‌ధుసూధ‌న్‌..
ఛాయాగ్ర‌హణం: శ‌్రీకాంత్ న‌రోజ్‌
నిర్మాణం: కె.శ్రీనివాసులు.. వేణుగోపాల్‌.. స‌జ్జు
ద‌ర్శ‌క‌త్వం: కృష్ణవంశీ.
నిర్మాణ సంస్థ‌లు: బుట్టబొమ్మ క్రియేష‌న్స్‌.. విన్ విన్ విన్ క్రియేష‌న్స్‌
మాస్టార్స్.కామ్ రేటింగ్ 2.5/5

ముందుమాట‌: క‌్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ సినిమా మార్కెట్ లోకి వ‌చ్చి మూడేళ్లు దాటిపోయింది. `గోవిందుడు అంద‌రివాడే` త‌ర్వాత వంశీ పూర్తిగా క‌థ‌పైనే ఫోక‌స్ చేయ‌డంతో ఈ గ్యాప్ అనివార్య‌మైంది. ఇంత గ్యాప్ తీసుకున్నారంటే అది భారీ కాన్వాస్ తో తెర‌కెక్కే సినిమా అవుతుంద‌ని అంతా భావించారు. అనుకున్న‌ట్లుగానే `న‌క్ష‌త్రం` ప్రాజెక్ట్ ను అనౌన్స్ భారీ అంచ‌నాలు క్రియేట్ చేశారు. సినిమాలో స్టార్ క్యాస్టింగ్ సందీప్ కిష‌న్, సాయిధ‌ర‌మ్ తేజ్, రెజీనా, ప్ర‌గ్యా జైశ్వాల్ తో తెర‌కెక్కించారు. కాగా ఆ సినిమా నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఆ సినిమా క‌థా క‌మామీషు ఏంటో ఓసారి చూద్దాం.

క‌థ‌: ఎస్. ఐ కావాల‌న్న‌ది రామారావు ( సందీప్ కిష‌న్) డ్రీమ్. త‌న తాత‌..తండ్రీ పోలీసు డిపార్ట్ మెంట్ లోనే ప‌నిచేస్తారు. దీంతో చిన్న‌ప్ప‌టి నుంచి పోలీస్ అనే ఒకే ఒక్క డ్రీమ్ లో ఉంటాడు. ఇంగ్లీష్ రాక‌పోయినా రాత ప‌రీక్ష‌లో ఎలాగూ నెగ్గుతాడు. అయితే క‌మీష‌న‌ర్ రామ‌బ్ర‌హ్మం ( ప్ర‌కాష్ రాజ్) కొడుకు రాహుల్ (త‌నీష్ ) కార‌ణంగా ఆ డ్రీమ్ చెదిరిపోతుంది. దీంతో ఆత్మ హ‌త్య చేసుకుందామ‌ని రైలు ప‌ట్టాల మీద ప‌డుకుంటాడు? అక్క‌డే అత‌ని క‌థ అడ్డం తిరుగుతుంది. ఆ ట‌ర్నింగ్ ఏంటి? రామారావు ఎస్. ఐ అయ్యాడా? లేదా? ఇందులో అలెగ్జెండ‌ర్ ( సాయిధ‌ర‌మ్ తేజ్) కు ఈ క‌థ‌కు సంబంధం ఏంటి? కిర‌ణ్ రెడ్డి( ప్ర‌గ్యాజైశ్వాల్), రెజీనా క్యారెక్ట‌ర్లు ఎలాంటివి? అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాల‌సిస్: నిజాయితీగ‌ల పోలీస్ అధికారులు..సిస్ట‌మ్… సిస్ట‌మ్ ను బ్రేక్ చేసి పోలీసు యూనిఫాంతో డ్యూటీ చేసే యువ‌కుడు.. మందు.. మార‌ణాయుధాల త‌యారీధారుల మ‌ధ్య జ‌రిగే సంఘ‌ర్ష‌ణే ఈ సినిమా. ఇలాంటి పాయింట్ తో గ‌తంలో కృష్ణ వంశీ ఖ‌డ్గం చేసేశాడు. మ‌ళ్లీ అదే సోల్ ను తీసుకుని న‌క్ష‌త్రం చిత్రాన్ని తెర‌కెక్కించ‌డం హాస్యాస్ప‌దం. క‌థ‌లో ఎంచుకున్న పాత్ర‌ల‌ను చూస్తున్నంత సేపు ఖ‌డ్గం లో క్యారెక్ట‌ర్లు గుర్తుకొస్తాయి. కుల‌..మ‌తాలేవైనా ఇండియ‌న్స్ అంతా ఒక్క‌టే అనే పాయింట్ తో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్ల‌ను అల్లుకుని ఖ‌డ్గం తెర‌కెక్కించాడు. అదే క‌థ‌ను కాస్త అటు ఇటు తిప్ప తీసిన‌ట్లుగా న‌క్ష‌త్రం ఉంటుంది. కాక‌పోతే న‌క్ష‌త్రంలో క్యారెక్ట‌ర్లను కాస్త స్టైలిష్ గా డిజైన్ చేశారు. ప్ర‌తీ స‌న్నివేశంలో కొత్త‌ద‌నంలో చూపించాల‌ని ప్ర‌య‌త్నం చేశాడు గానీ..అవి చూస్తున్నంత సేపు ఇంట‌ర్ డ‌క్ష‌న్ సీన్స్ లా అనిపిస్తాయి. ప్ర‌ధ‌మార్థంలో సందీప్ కిష‌న్ క్యారెక్ట‌ర్ బాగుంది. ఆ విధంగా క‌థ న‌డిపిన విధానం ప‌ర్వాలేదు. అయితే అండ‌ర్ క‌రెంట్ గా అలెగ్జండ‌ర్ పాత్ర‌ను సృష్టించి క‌థ‌ను ఎక్క‌డికో తీసుకెళ్లిన‌ట్లు అనిపించింది. ఆ రెండిటి మ‌ధ్య క‌నెక్టివిటీ మిస్ అయిన‌ట్లు అనిపించింది. ఆ క్యారెక్ట‌ర్ ను స‌స్పెన్స్ గా చూపించాల‌ని ట్రై చేశారు. ప్ర‌ధ‌మార్థంలో ఆ క్యారెక్ట‌ర్ రివీ్ల్ చేస్తే క‌థ‌కు క‌నెక్టివిటీ కుదిరేది. ఇంట‌ర్వెల్ బ్యాంగ్ కు ముందే ఆ పాత్ర‌ను రివీల్ చేయ‌డం.. ద్వితియార్థంలో ఆ క్యారెక్ట‌ర్ చూపించ‌డం..ఆ వెంట‌నే పాత్ర‌ను ముగించ‌డం స‌రిగ్గా కుద‌ర్లేదు. సిన్సియ‌ర్ గా ఉండే క‌మీష‌న‌ర్ కొడుకునే పెద్ద విల‌న్ గా చూపించ‌డం అనేది క‌థ‌కు స‌రిగ్గా కుద‌ర్లేదు. అలెంగ్జండ‌ర్ క్యారెక్టను అంతం చేసిన‌ట్లే హీరో పాత్ర‌ను ముగించాల‌నుకున్న థాట్ అస్స‌లు బాగాలేదు. డ్ర‌గ్స్ ఎక్కించేసి జ‌నాల మ‌ధ్య‌లోకి వ‌దిలేయ‌డం అనేది చాలా సిల్లీగా….చిల్ల‌ర‌గా అనిపించింది. ఆ సీన్స్ చూస్తున్నంత సేపు కృష్ణ‌వంశీ ఇలాంటి సీన్లు తీశాడా? అనిపిస్తుంది. అయితే స్టార్టింగ్ నుంచి ఎండిగ్ వ‌ర‌కూ వంశీ స్టైల్లో క‌ల‌ర్ ఫుల్ గానే స్ర్కీన్ క‌నిపించింది. ఓవ‌రాల్ గా ఈ న‌క్ష‌త్రంలో మెరుపులు అయితే క‌ష్ట‌మే.

న‌టీన‌టులు: స‌ందీప్ కిష‌న్ క్యారెక్ట‌ర్ బాగుంది. సాయిధ‌ర‌మ్ తేజ్ పాత్ర‌ను ఇంకా ప‌వ‌ర్ ఫుల్ గా చూపించి ఉంటే బాగుండేది. స్టార్ డ‌మ్ ఉన్న హీరోను అంత సింపుల్ గా తేల్చేయ‌డం బాగాలేదు. రెజీనా ష‌రా మాములుగా అందాలతో మెప్పించే ప్ర‌య‌త్నం చేసింది. ప్ర‌ధ‌మార్థం అంతా రెజీనా అందాలే. ప్ర‌గ్యాజైశ్వాల్ పాత్ర బాగుంది. ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా చ‌క్క‌గా కుదిరింది. మిగ‌తా పాత్ర‌లు త‌మ ఫ‌రిది మేర న‌టించారు.

సాంకేతిక వ‌ర్గం: సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. శ్రీకాంత్ న‌రోజ్ ఛాయాగ్ర‌హ‌ణం, భీమ్స్ నేప‌థ్య సంగీతం బాగా కుదిరాయి. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. అయితే కృష్ణ వంశీ గ‌త సినిమాల‌ను దృష్టిలో పెట్టుకుని వెళ్లే బొక్క బోర్లా ప‌డ‌టం మాత్రం ఖాయం.

చివ‌రిగా: మెరుపులు లేని `న‌క్షత్రం`

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు సినీ టివి డైరి లాంచ్
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ...
టెల్ మీ బాస్ పిక్చర్స్ 'కుమార్ రాజా` కొత్త చిత్రం ప్రారంభం
Tellmeboss Pictures పతాకంపై నిర్మాత శ్రీచక్ర మల్లికార్జున తన స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తొలిచిత్రం ‘కుమార్ రాజా’ చిత్ర...
powered by RelatedPosts