మార్చి 18 నుంచి నాగ్, నాని మ‌ల్టీస్టార‌ర్

0

కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని హీరోలుగా వైజయంతి మూవీస్‌ పతాకంపై టి.శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్‌ భారీ మల్టీస్టారర్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ మార్చి 18 ఉగాది రోజున ప్రారంభం అవుతుంది.

ఈ సందర్భంగా అగ్రనిర్మాత సి.అశ్వనీదత్‌ మాట్లాడుతూ ”మా వైజయంతి బేనర్‌లో మణిశర్మ చేసిన సినిమాలన్నీ మ్యూజికల్‌గా పెద్ద హిట్స్‌ అయ్యాయి. ఈ సినిమాని కూడా మ్యూజికల్‌గా బిగ్గెస్ట్‌ హిట్‌ చెయ్యాలని ఫుల్‌గా కాన్‌సన్‌ట్రేట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఈ సినిమాలోని సాంగ్స్‌ని మణిశర్మ కంపోజ్‌ చేస్తున్నారు. మూడు పాటలకు సంబంధించిన మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ అక్కడ జరుగుతున్నాయి. మార్చి 18 ఉగాది రోజు నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తున్నాం. మా బేనర్‌లో ఎన్నో మల్టీస్టారర్స్‌ చేశాం. అవన్నీ కమర్షియల్‌గా ఘనవిజయాల్ని అందుకున్నాయి. ఇప్పుడు నాగార్జున, నాని కాంబినేషన్‌లో చేస్తున్న మల్టీస్టారర్‌ కూడా బిగ్గెస్ట్‌ హిట్‌ అయి మా బేనర్‌కి మరింత మంచి పేరు తెస్తుంది” అన్నారు.
దర్శకుడు టి. శ్రీరామ్‌ ఆదిత్య మాట్లాడుతూ – ”ఎంటర్‌టైనింగ్‌ వేలో సాగే డిఫరెంట్‌ సబ్జెక్ట్‌ ఇది. నాగార్జునగారు, నాని వంటి హీరోలతో వైజయంతి బేనర్‌లో ఈ మల్టీస్టారర్‌ చెయ్యడం చాలా ఆనందంగా ఉంది” అన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

వెంకీ-సునీల్ తో రాఘ‌వేంద్ర‌రావు సినిమా!
విక్ట‌రీ వెంక‌టేష్, సునీల్- ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్ లో మ‌రో సినిమాకు రంగం సిద్ద‌మ‌వుతోందా? అది భ‌క్తి నేప‌థ్యంగ‌ల సినిమాన...
మార్చి 5న 'కణం' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌
'ఛలో'తో సూపర్‌హిట్‌ కొట్టిన నాగశౌర్య, 'ఫిదా', 'ఎంసిఎ' వంటి సూపర్‌హిట్స్‌ ఇచ్చిన సాయిపల్లవి కలిసి ఎన్‌.వి.ఆర్‌. సినిమా సమర్పణలో లైౖకా ప్రొడక్షన్స...
నాని, నాగ్ ల‌ మల్టీస్టారర్‌ పాటల రికార్డింగ్‌ ప్రారంభం
కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని హీరోలుగా వైజయంతి మూవీస్‌ పతాకంపై టి.శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్‌ నిర్మిస్తున్న...
powered by RelatedPosts