నాని, నాగ్ ల‌ మల్టీస్టారర్‌ పాటల రికార్డింగ్‌ ప్రారంభం

0

కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని హీరోలుగా వైజయంతి మూవీస్‌ పతాకంపై టి.శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్‌ నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్‌ పాటల రికార్డింగ్‌ నాని పుట్టినరోజు సందర్భంగా మహతి రికార్డింగ్‌ స్టూడియోలో ప్రారంభమైంది. గతంలో వైజయంతి మూవీస్‌ బేనర్‌లో ఆఖరిపోరాటం, ఆజాద్‌, రావోయి చందమామ వంటి ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలు చేసిన కింగ్‌ నాగార్జున మరోసారి వైజయంతి బేనర్‌లో ఈ మల్టీస్టారర్‌ చేస్తున్నారు. నేచురల్‌ స్టార్‌ నాని మొదటిసారి ఈ బేనర్‌లో నటిస్తున్నారు. గతంలో అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్‌ ఎన్నో మల్టీస్టారర్స్‌ చేశారు. ఇప్పుడు కింగ్‌ నాగార్జున, నేచురల్‌స్టార్‌ నానిలతో ఈ భారీ మల్టీస్టారర్‌ను వైజయంతి మూవీస్‌ బేనర్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా అగ్రనిర్మాత సి.అశ్వనీదత్‌ మాట్లాడుతూ ”నాగార్జున, నాని వెరైటీ కాంబినేషన్‌లో ఒక ఇంట్రెస్టింగ్‌ సబ్జెక్ట్‌తో ఎంటర్‌టైనింగ్‌ వేలో చాలా భారీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. మా బేనర్‌లో వచ్చిన ఎన్నో మల్టీస్టారర్స్‌ని ఆదరించిన ప్రేక్షకుల్ని ఈ సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది. మా బేనర్‌లో ఎన్నో మ్యూజికల్‌ హిట్స్‌ ఇచ్చిన మణిశర్మ సంగీత సారధ్యంలో పాటల రికార్డింగ్‌ ప్రారంభించాం. మార్చిలో షూటింగ్‌ని స్టార్ట్‌ చేస్తాం. మిగతా నటీనటుల ఎంపిక జరుగుతోంది” అన్నారు.
దర్శకుడు టి.శ్రీరామ్‌ ఆదిత్య మాట్లాడుతూ ”నాగార్జునగారు, నాని కాంబినేషన్‌లో సినిమాని డైరెక్ట్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. అందులోనూ వైజయంతి మూవీస్‌ వంటి పెద్ద బేనర్‌లో సినిమా చేయడం మరింత ఆనందంగా ఉంది. ఇది దర్శకుడుగా నాకు ఓ ప్రెస్టీజియస్‌ మూవీ అవుతుంది” అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, స్క్రిప్ట్‌ అడ్వైజర్‌: సత్యానంద్‌, సినిమాటోగ్రఫీ: శ్యామ్‌దత్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి, మాటలు: వెంకట్‌ డి. పట్టి, శ్రీరామ్‌ ఆర్‌. ఇరగం, కో-డైరెక్టర్‌: తేజ కాకుమాను, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: మోహన్‌, నిర్మాత: సి.అశ్వనీదత్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: టి.శ్రీరామ్‌ ఆదిత్య.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
ప్ర‌తిభ‌కు ప్రోత్సాహం -వాళ్ల డ్రీమ్ ఫుల్ ఫిల్ చేయ‌డ‌మే AISFM ల‌క్ష్యం: AISFM చైర్మన్ అక్కినేని నాగార్జున
'AISFM గ్రాండ్ ఫిలిం ఫెస్టివల్ 2018 ' లో భాగంగా అన్నపూర్ణ ఇంటర్నేషనల్ ఫిలిం స్కూల్ విద్యార్థులు నిర్మించిన 8 చిత్రాల ప్రదర్శనఅన్నపూర్ణ ఇం...
విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు సినీ టివి డైరి లాంచ్
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ...
powered by RelatedPosts