నేను బాగానే ఉన్నాను: కమల్ హాసన్

0

kamal-hasan-stills-tollywoodtv (18)కొద్దిరోజుల క్రితం విషాహారం తినడం వల్ల అస్వస్థతకి గురై చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న కమల్ హాసన్ ఆరోగ్యం ఇప్పుడు కుదుటపడింది అని తెలుస్తోంది. విషాహారం వల్లే తాను అస్వస్థతకు గురయ్యారని, అంతకన్నా మరేమీ లేదన్నారు.
చాలామంది ఈ విషయాన్ని డ్రామా చేయాలని చూస్తారని, అందుకు వారిని నిరుత్సాహపరుస్తున్నట్లు కమల్ తెలిపారు. కాగా కమల్ అనారోగ్యానికి సంబంధించి పలు వార్తలు ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కమల్ నరాల వ్యాధితో బాధపడుతున్నట్లు కథనాలు వెలువడ్డాయి. మంగళవారం షూటింగ్ లో పాల్గొన్న ఆయన అస్వస్థతకు గురి అవటంతో చిత్ర యూనిట్ ఆయన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.

ఇక కమల్ తన అనారోగ్యంపై వచ్చిన వార్తలను ఖండించారు. షూటింగ్ సందర్భంగా ఫుడ్ పాయిజన్ తో పాటు డీహైడ్రేషన్ గురైనట్లు ఆయన పేర్కొన్నారు. అంతే తప్ప ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. కేరళలో మారుమూల ప్రాంతాల్లో షూటింగ్ సందర్భంగా అక్కడ సరైన హోటల్స్ లేనందున రోడ్డు పక్కన ఉండే దాబాల్లో తినేవారిమని, అలాగే కలుషిత నీరు తాగినట్లు చెప్పారు. కాగా బుధవారం కమల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. ప్రస్తుతం ఆయన ‘పాపనాశనం’ షూటింగ్ లో పాల్గొంటున్నారు. మలయాళ, తెలుగు లో ఘనవిజయం సాధించిన ‘దృశ్యం’ రీమేక్. డిశ్చార్జ్ అనంతరం కమల్ షూటింగ్ లో పాల్గొననున్నట్లు సమాచారం.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
powered by RelatedPosts