నా కూతురికి సినిమాలంటే నచ్చవు:కరీనా

0

kareenaఒక్క నిమిషం… ఇంతకీ మీరు ఏ కరీనా గురించి మాట్లాడుతున్నారు? అని అడుగుతున్నారా? మీరు ఊహించిన కరీనానే..!! జీరో సైజ్ ఫిగర్ తో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టించిన అందాల తార కరీనా కపూర్ గురించే మెమిప్పుడు చెప్పబోతున్నది అంటే ఆశ్చర్యపోతారు. అదేంటి, కరీనాకి మొన్నే కదా పెళ్లైంది…అప్పుడే అంత పెద్ద కూతురు ఎలా పుట్టేసింది అంటారా? మీరల అడగటంలో అస్సలు తప్పులేదు. ఎందుకంటే ఆల్రెడీ పెళ్లై పిల్లలున్న తండ్రి సైఫ్ అలీ ఖాన్ ని పెళ్లి చేసుకుంది కాబట్టి, సైఫ్ బిడ్డలకి కరీనా తల్లి వరసే కదా… సవతి తల్లి అన్నమాట . ఇదే అమ్మ హోదాలో సైఫ్ ఆలీ ఖాన్ కూతురు సారా ఖాన్ గురిచి మాట్లాడుతూ, సారా సినిమాల్లో నటించనున్నట్టు వస్తున్న వార్తలన్ని నిరాధారమేనని బాలీవుడ్ నటి కరీనా కపూర్ కొట్టి పారేసింది. సారా సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపడం లేదు. కొలంబియాలో చదువుకుంటోంది. చదువు పూర్తికావడానికి మరో ఐదేళ్లు పడుతుంది.

బాలీవుడ్ లో ప్రవేశించే ప్లాన్స్ లేవు. రూమర్లు ఎక్కడ నుంచి వస్తున్నాయో అర్ధం కావడం లేదు అని కరీనా అన్నారు. ప్రస్తుతం తాను సింగం రిటర్న్ అనే చిత్రంలో నటిస్తున్నానని.. ఆ చిత్రం ఘనవిజంయ సాధిస్తుందనే ఆశాభావాన్ని కరీనా వ్యక్తం చేశారు.

అమృతాసింగ్, సైఫ్ దంపతులకు సారా, ఇబ్రహీం అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అమృతా సింగ్ కు విడాకులిచ్చిన సైఫ్ కరీనాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ప‌వ‌న్ టైటిల్ `రాజా వ‌చ్చినాడు`!
పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈచిత్రానికి ...
మెగాస్టార్ 151వ సినిమా `ఉయ్యాలవాడ` మొద‌లైంది
మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చిత్రం నేడు హైద‌రాబాద్ లో మొదలైంది. కొణిదెల ప్రొడక్షన్స్‌ కార్యాలయంలో పూజా కార్యక...
సాయిధరమ్‌తేజ్‌, ఎ.కరుణాకరన్‌ కాంబినేషన్‌లో కె.ఎస్‌.రామారావు భారీ చిత్రం ప్రారంభం
సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాణ సంస్థ క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత కె...
powered by RelatedPosts