నాన్న ప్రేమ‌క‌థ‌ల‌న్నింటికంటే భిన్న‌మైన‌ది `మోహ‌బూబా`: ఆకాష్ పూరి

0


ఆకాష్ పూరి, నేహా శ‌ర్మ జంట‌గా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన `మెహ‌బూబా` మే11న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం సాయంత్రం హైదార‌బాద్ లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆకాష్ పూరి మాట్లాడుతూ…

==మా నాన్న ల‌వ్ స్టోరీలు డిఫ‌రెంట్ గా ఉంటాయి. కానీ ఈ స్టైల్ ల‌వ్ ఉంటుంద‌ని అస్స‌లు ఊహించ‌లేదు. 1971 ఇండో -పాక్ నేప‌థ్యంలో సాగే క‌థ‌. ఇండియ‌న్ అబ్బాయి-పాకిస్తాన్ అమ్మాయి మ‌ధ్య జ‌రిగే క‌థ‌. చిన్న‌ప్ప‌టి నుంచి ఆర్మీకి వెళ్లాల‌న్న క‌ల‌…ఆ త‌ర్వాత ల‌వ్ స్టోరీ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. తొలుత ఆర్మీ పాత్ర చాలా భ‌య‌ప‌డ్డా. కానీ మా నాన్న క్యారెక్ట‌ర్ డిజైన్ చేసిన విధానం బాగుంది. ఆయ‌న వ‌ల్లే ఈ పాత్ర చేయ‌గ‌లిగాను. అందుకోసం చాలా హోం వ‌ర్క్ చేసాను. జ‌వాన్ లా సెల్యూట్ కొట్ట‌డం కోసం పై చాలా రిసెర్చ్ చేశా. అందుకు చాలా టైమ్ తీసుకున్నా. సినిమాలో చాలా యాక్ష‌న్ ఉంటుంది. ఫైట్స్ బాగా వ‌చ్చాయి. అవి బాగా ఇష్టం అందుకే ఫ్యాష‌న్ తో చేసా.
హీరోయిన్ నేహా శెట్టి చాలా బాగా న‌టించింది. సెట్స్ లో మా అసిస్టెంట్లు త‌ను బాగా చేసింది. నువ్వు చేయ‌క‌పోతే తేలిపోతావ‌న్నారు. దీంతో నేను కూడా ఆమెకు పోటీగానే న‌టించా. సినిమా ట్రైల‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే పాట‌లు పెద్ద హిట్ అయ్యాయి. సినిమాపై కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మా సినిమాను దిల్ రాజు రిలీజ్ చేయ‌డ‌లం చాలా సంతోషంగా ఉంది. అందుకు ఆయ‌న‌కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నా

==చిన్న‌ప్పుడు నుంచి యాక్ట‌ర్ అవ్వాల‌ని ఉండేది. ఆ పిచ్చితోనే నాన్న‌ను వేషం అడిగేవాడిని. `బుజ్జిగాడు` గాడు టైమ్ లో యాక్టింగ్ పెద్ద‌గా తెలియ‌దు. త‌ర్వాత అన్నీ నేర్చుకున్నా. ప్ర‌తీ సినిమాకు నేర్చుకుంటూరు ఉంటా.

== క‌థ‌ల విష‌యంలో నాన్న‌కు కు ఓ స్టైల్ ఉంటుంది. కానీ ఈ క‌థ విని ఆయ‌న రాసారా? అనిపించింది. చాలా కొత్త‌గా ఉంటుంది. రొమాంటిక్ సినిమాల విష‌యంలో నాన్న ను మ‌ర్చిపోయి న‌టించా. తెర‌పై ఆ సీన్ ఎలా ఉంటుందో ఊహించుకుని చేసా.

==మా నాన్న కాంప్లి మెంట్ ఇవ్వ‌రు. షూటింగ్ స‌మ‌యంలో సూప‌ర్ గా చేసావ్ రా ? అన్నారు. ఆ మాట నా జీవితాంతం గుర్తుండి పోతుంది.

==ఏ హీరోను టార్గెట్ చేయ‌లేదు. రామ్ చ‌ర‌ణ్ సినిమాతో న‌టుడిగా లాంచ్ అయ్యా. ప్ర‌భాస్, మ‌హేష్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంద‌రితో చేశాను. చాలా ల‌క్కీ. వాళ్లంద‌రి ద‌గ్గ‌ర నుంచి చాలా నేర్చుకున్నా. వాళ్లంతా చాలా ఇష్టం. స్టార్ స్టేట‌స్ కావ‌లంటే క‌ష్ట‌ప‌డాలి. ర‌జ‌నీకాంత్ గారు నాకు రోల్ మోడ‌ల్. ఆయ‌నే నాకు స్ఫూర్తి. చిన్న‌ప్ప‌టి నుంచి ఆయ‌నంటే చాలా ఇష్టం.

==స‌ల్మాన్ ఖాన్ జిందాబాద్, షార్ ఖాన్ జిందా బాద్ ఏంట‌ని చాలా మంది అడిగారు. ఆ సీన్ చాలా పెద్ద‌ది. బాగా వ‌చ్చింది. అదెలా ఉంటుందో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ట్రైల‌ర్ రిలీజ్ అయిన ద‌గ్గ‌ర నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమాలో ఇంకా మంచి డైలాగులున్నాయి. మెహ‌బూబా జిందా బాద్ డైలాగ్ చెప్ప‌గానే అంత చ‌ప్ప‌ట్లు కొట్టారు.

==ఈ సినిమాలో నా ఇన్ ఫుట్స్ ఏమీ లేవు. నాన్న చెప్ప‌టిన‌ట్లు చెసా అంతే. త‌దుప‌రి సినిమా కూడా నాన్న‌తోనే ఉంటుంది. స్టోరీ రెడీ అవుతోంది.

==ఆర్టిస్ట్ గా నా బ‌లం ఏంట‌న్న‌ది నేను చెప్ప‌కూడ‌దు . కానీ ట్రైల‌ర్ చూసిన వారంతా వాయ‌స్ బాగుంద‌న్నారు. నా బ‌లాలం ఏటో సినిమా చూసి ఆడియ‌న్స్ చెబుతారు. అలాగే లోపాలు కూడా.

==10 ఏళ్ల కు స‌రిపోయే సినిమా స్టోరీ లైన్స్ నాన్న ద‌గ్గ‌ర ఉన్నాయి. వాటిని డెవ‌ల‌ప్ చేయాలంతే. జీవితంలో ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా ధైర్యంగా ఉండాలి. అది నాన్న‌ను చూసి నేర్చుకున్నా. ఆయ‌న సినిమా న‌మ్ముకుని బ్ర‌తుకుతున్నారు. ఒక టైమ్ లో ఆయ‌న ఒక్క‌రే మిగిలారు. మ‌ళ్లీ కింద నుంచి పైకి వ‌చ్చారు. ఆయ‌న ద‌గ్గ‌ర నుంచి నిరంత‌రం నేర్చుకుంటూనే ఉంటా. ఇంట‌ర్మిడియ‌ట్ పూర్తిచేసా. ఇప్ప‌టికే ఎంబీబీఎస్ చ‌దివ‌ని పీలింగ్ ఉంది. ఎందుకంటే సినిమాల‌పై నాకున్న పిచ్చి అలాంటింది అని అన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
ఆకాష్‌ని అందరూ అప్రిషియేట్‌ చెయ్యడం చాలా ఆనందంగా ఉంది  - డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ 
పూరి ఆకాష్‌ను హీరోగా పరిచయం చేస్తూ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ రూపొందించిన డిఫరెంట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'మెహబూబా'. శ్రీమత...
powered by RelatedPosts