గోవిందుడు క్లైమాక్స్ చిరుని ఏడిపించిందట

0

Chiranjeevi-New-Movie-Uyyalawada-Narsimha-Reddyచిన్న సినిమానా లేక పెద్ద సినిమానా అని కాదు, ఏ స్థాయి సినిమాకైనా ప్రధానంగా ముగింపు(క్లైమాక్స్) ఆకట్టుకునే విధంగా ఉండాలి. ఎందుకంటే, సినిమా చూసి హాల్ బయట అడుగుపెట్టిన ప్రేక్షకుడి బుర్రలో మిగతా సినిమా కథ అంతా స్టోర్ అవ్వదు…కేవలం క్లైమాక్స్ మాత్రమే గట్టిగా నాటుకుంటుంది. అందుకే, సినిమా మొత్తం ఎంత బాగా చేసినా, క్లైమాక్స్ లో ఏమాత్రం అటూ ఇటూ అయినా ఇక అంతే…!!

క్లైమాక్స్ సీన్స్ ఆకట్టుకోవడంతోనే ‘బొమ్మరిల్లు ‘ నుంచి నిన్నటి పవన్ ‘అత్తారింటికి దారేది’ వరకు రికార్డులు క్రియేట్ చేయడానికి ఆ సినిమాల క్లైమేక్స్ సన్నివేశాలు ఉపయోగపడ్డాయి అన్న విషయం అందరు అంగీకరించే నిజం. ఈ నేపధ్యంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న కృష్ణవంశీ ‘గోవిందుడు అందరివాడేలే’ క్లైమేక్స్ సన్నివేశాలు పవన్ ‘అత్తారింటికి దారేది’ సినిమా క్లైమేక్స్ ను మించే విధంగా కృష్ణవంశీ చిత్రీకరించాడని ఫిలింనగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా క్లైమేక్స్ సన్నివేశాలలో రామ్ చరణ్, ప్రకాష్ రాజ్, జయసుదల పై చిత్రీకరించిన ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాకు గుండెకాయగా మారతాయని అంటున్నారు. చరణ్ లో ఇప్పటి వరకు బయటకు రాని నిజమైన నటుడుని ‘గోవిందుడు’ క్లైమేక్స్ సన్నివేశాలలో చూడబోతున్నారని ఈ క్లైమేక్స్ షూటింగ్ చూసిన వాళ్ళు అంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలే నిజం అయితే ఈ సినిమాతో రామ్ చరణ్ ఫ్యామిలీ ఆడియన్స్ కు చేరువ కావడం ఖాయం అని అనుకోవాలి.

ఇదంతా ఒక ఎత్తైతే, ఇటీవలే క్లైమాక్స్ సీన్ రష్ చూసిన చిరంజీవి సైతం కంటతడి పెట్టుకునెంతగా కదిలిపొయాడాట..!! చూడబోతే, ఈసారి కృష్ణవంశీ పెద్ద హిట్టే కొట్టేలా కనిపిస్తున్నాడు…ఏమంటారు?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts