జ‌వాన్ ల సంక్షేమానికి కొటి విరాళం ప్ర‌క‌టించిన మెగా అభిమానుల సంఘం

0

దేశ ర‌క్ష‌ణ కోసం స‌రిహ‌ద్దుల్లో శ్ర‌మిస్తున్న జ‌వాన్ల సంక్షేమానికి అఖిల్ భారత చిరంజీవి అభిమానుల సంఘం కోటి రూపాయ‌లు విరాళం ప్ర‌క‌టించింది. న‌న్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తిలోని మంగ‌ళ‌గిరి చిన‌కాకాని వ‌ద్ద హాయ్ లాండ్ లో చిరంజీవి యువ‌త జాతీయ స‌మావేశం ఏర్పాటు చేసింది. దేశంలో ప‌లు రాష్ర్టాల నుంచి ప్ర‌తినిధులు పాల్గొన్నారు. అమ‌ర జ‌వాన్ల కుటుంబాలను ఆదుకోవ‌డం, వారి పిల్ల‌ల‌ల‌ను చ‌దివించ‌డం కోసం త్వ‌ర‌లో ర‌క్ష‌ణ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న‌న్ క‌లిసి కోటి విరాళం అంద‌జేస్తామ‌ని సంఘం జాతీయ అధ్య‌క్షుడు స్వామి నాయుడు తెలిపారు.

చిరంజీవి పిలుపు మేర‌కు ర‌క్త‌దాన శిబిరాల‌ను ముందుకు తీసుకెళ్తామ‌న్నారు. విశాఖప‌ట్టణంలో మార్చి 18న రామ్ చ‌ర‌ణ్ న‌టించిన `రంగ‌స్థలం` సినిమా ఆడియో ఫంక్ష‌న్ కి ల‌క్ష‌లాది మంది హ‌జ‌ర‌య్యేలా చూస్తామ‌ని తెలిపారు. వేస‌విలో తెలుగు రాష్ర్టాల్లో తాగు నీరు స‌మ‌స్య ఉన్న ప్రాంతాల్లో మంచి నీరు స‌ర‌ఫ‌రా చేస్తామ‌న్నారు. దీనికి సంబంధించి మోడ‌ల్ చ‌లివేంద్రాలు ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఈ స‌మావేశంలో జాతీయ నిర్వాహ‌క అధ్య‌క్షులు క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌హేష్‌, ఉత్త‌రాంద్ర అధ్య‌క్షులు తొట‌కూర వెంక‌ట‌ర‌మ‌ణను స‌న్మానించారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ఏపీలో షార్ట్ ఫిలిం పోటీలు
ఆంధ్రప్రదేశ్‌ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ద్వితీయ ఉగాది సినిమా పురస్కారాల్లో భాగంగా షార్ట్‌ ఫిల్మ్‌ పోటీని నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫ...
చెర్రీ అభిమానం సూప‌ర్!
మెగా స్టార్ చిరంజీవి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ తర్వాత మెగా పవర్ స్టార్ గా ఎదిగిన హీరో రామ్ చరణ్. సినిమాల్లోకి వచ్చిన అతి కొద్దీ రోజులకే టాలీవు...
ఫ్యాన్ మూమెంట్ విత్ మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవితో సెల్ఫీ ఛాన్సుసొస్తే ఎవ‌రు వ‌దులుకుంటారు చెప్పండి. చేతిలో మొబైల్ తీసుకుని నాలుగు సెల్ఫీల‌తో క్లిక్ మ‌నిపిస్తాం. అటుపై చిరు ప...
powered by RelatedPosts