ప‌వ‌న్ తో సినిమా చేయాలంటోన్న మంజుల‌

0

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో సినిమా చేయ‌డం అనేది ఏ ద‌ర్శ‌కుడికైనా ఓ డ్రీమ్. అది నెర‌వేర‌డం అంటే చిన్న విష‌యం కాదు. ఎన్నో ఏళ్ల‌..శ్ర‌మ కృషి..ప‌ట్టుద‌ల ఉంటే గాని సాధ్యంకానిది. తాజాగా త‌న మ‌న‌సులో కోరికను నటి, దర్శకురాలు మంజుల మరోసారి బయటపెట్టారు. ఆమె దర్శకురాలిగా పరిచయం కాబోతోన్న సినిమా ‘మనసుకు నచ్చింది’. సందీప్‌ కిషన్‌, అమైరా దస్తూర్‌ జంటగా నటించారు. ఆనంది ఆర్ట్స్‌, ఇందిర ప్రొడక్షన్స్‌ పతాకాలపై పి.కిరణ్‌, సంజయ్‌ స్వరూప్‌ నిర్మించారు. రధన్‌ బాణీలు సమకూర్చారు. ఫిబ్రవరి 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

పవన్‌ కోసం కథ రాసుకున్నానని, దాని టైటిల్‌ ‘పవన్‌’ అని అన్నారు’’ అని ఓ విలేకరి మంజులను ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘అవును చెప్పాను. కథ కూడా ఉంది. నిజంగా చెబుతున్నా.. మా నాన్న , నా సోదరుడి తర్వాత నేను మెచ్చే వ్యక్తి ఆయన (పవన్‌). మనసు ఏది చెబుతుందో అదే చేస్తారు, నిజాయతీ కలిగిన వ్యక్తి. ఆయన కోసం కథ ఉంది. ఇక ఆయన సినిమాలు చేయరని నాకు తెలుసు. కానీ, నేను రాసుకున్న కథ ఆయన విన్నారంటే కచ్చితంగా చేస్తారని న‌వ్వేసింది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఉన్న సినిమా ఇది: హీరో నితిన్!
నితిన్, మేఘా ఆకాశ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఛల్ మోహన్‌రంగ’. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదలవుతుంది. మార్చి 30న హీరో నితిన్ పుట్టినరోజు. ఈ సంద...
వెండి తెరకు మహే‌శ్ మేన కోడలు
సూపర్ స్టార్ మహేష్ ఫ్యామిలీ నుండి మరో స్టార్ వెండి తెర మీద మెరవ మెరవబోతున్నారు. ఒకప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని ఎంతో ఆశ పడ్డ మహేశ్ సోద...
Mahesh Babu's sister to direct Sundeep Kishan
According to latest update, Super Star Mahesh Babu's sister, Manjula will soon wield the megaphone. According to sources, She will be directi...
powered by RelatedPosts