'హెచ్ఎసి అంబాసిడర్'గా మహేష్

0

Mahesh-Babu-Unseen-Pics-From-Dookudu-Movie-93టాలీవుడ్ నంబర్ వన్ హీరో మహేష్ బాబు చాలా నిరాడంబరంగా ఉంటారు. మహేష్ కి ఎలాంటి భేషజాలు తెలియవు. తనేంటో తన పనేంటో అన్నట్లుగా ఉంటారు. సినిమాలు, వాణిజ్య ప్రకటనల ద్వారా కోట్లు సంపాదిస్తున్న మహేష్ బాబు తన సంపాదనలో కొంత మొత్తం సేవా కార్యక్రమాలకు కూడా వినియోగిస్తున్నారు. అయితే, వాటి గురించి పెద్దగా బయటికి చెప్పుకోరు. అయితే, ఎవరికైనా ఆదర్శంగా నిలుస్తుందనే విషయాలను మాత్రం బయటికి చెబుతారు. తాజాగా అలాంటి ఓ విషయాన్ని మహేష్ బాబు బయటపెట్టారు. అదేంటంటే…

‘హీల్ ఎ చైల్డ్ (హెచ్ఎసి) అనే సేవా సంస్థ ఉంది. ఆర్థిక స్తోమత లేక వైద్యానికి నోచుకోని పిల్లల కోసం ఈ ఫౌండేషన్ స్థాపించారు. దీనికి మహేష్ బాబు ‘హెచ్ఎసి అంబాసిడర్’గా వ్యవహరించడానికి అంగీకరించారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ – ”ఈ ఫౌండేషన్ ఆరంభించి నాలుగేళ్లయ్యింది. ఈ నాలుగేళ్లల్లో ఎంతోమంది పిల్లల ప్రాణాలను కాపాడారు. ఆర్థికంగా వెనకబడి, తమ పిల్లలకు వైద్యం చేయించలేని తల్లిదండ్రులకు హెచ్ఎసి సహాయం చేస్తుంది. పిల్లలను కాపాడదాం. అందుకోసం అందరం ఒకటవుదాం” అని పేర్కొన్నారు. ఓ సత్కార్యక్రమం కోసం మహేష్ బాబు ఇచ్చిన ఈ పిలుపు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుందనీ, తద్వారా ఎంతోమంది పిల్లలకు వైద్య సహాయం అందుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

powered by RelatedPosts