డైలమాలో మహేష్ బాబు

0

Mahesh-Babu-Unseen-Pics-From-Dookudu-Movie-93ప్రిన్స్ మహేష్ బాబు ఓ డైలమాలో పడిపోయాడట. ప్రస్తుతం తను కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు’ టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. ఇది సమ్మర్ కానుకగా విడుదలకానుంది. దీని తర్వాత సినిమాని ఏ డైరెక్టర్ తో కమిట్ అవ్వాలనే విషయంలో మహేష్ బాబు డైలమాలో పడిపోయాడని సమాచారమ్. శ్రీకాంత్ అడ్డాల ఓ ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ మహేష్ బాబుకి చెప్పాడు. ఈ ప్రాజెక్ట్ ని పివిపి సంస్థ నిర్మించడానికి సిద్ధంగా ఉంది. మరోవైపు పూరి జగన్నాధ్ ఓ యాక్షన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ని మహేష్ కి చెప్పాడు. ఈ కథతో సినిమా చేయడానికి అశ్వనీదత్ రెడీగా ఉన్నారు. ఈ రెండూ కథలూ మహేష్ బాబుకి బాగా నచ్చాయట.

కాగా ఈ రెండింటిలో ఏది ముందు చేయాలనే విషయంలో మాత్రం మహేష్ కాస్త కన్ ఫ్యూజన్ లో ఉన్నాడని తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తను చేస్తున్న ‘శ్రీమంతుడు’ ఫ్యామిలీ ఓరియంటెడ్, అండ్ క్లాస్ గా ఉంటుందట. శ్రీకాంత్ అడ్డాల చెప్పిన కథ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ అండ్ క్లాస్ గా ఉంటుందట. వెంటవెంటనే రెండు సినిమాలు ఇదే జానర్ కి సంబంధించినవి అయితే అభిమానులు నిరాశపడతారేమోనని ఆలోచిస్తున్నాడట మహేష్.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts