కొడుకుకి సూపర్‌స్టార్ స్పెషల్ బర్త్‌డే గిఫ్ట్

0

Mahesh-Babu-Gift-for-Son-gautham-krishnaకొడుకుకి అరుదైన బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వనున్న సూపర్‌స్టార్

ఏ తండ్రికైనా తన బిడ్డ అంటే ముద్దే కదా. ఇక వాళ్ళ పుట్టినరోజు నాడు ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు బహుమతులు ఇస్తుంటారు. అదే సూపర్‌స్టార్ మహేష్‌బాబు లాంటి తండ్రైతే, ఇంకాస్త భారీగానే బహుమతి ఇస్తాడు . గత సంవత్సరం పుట్టినరోజుకు తన కొడుకు గౌతమ్ కృష్ణకు కోటి రూపాయలకు పైగా విలువగల క్రూయిజర్ కారును బహుమతిగా ఇచ్చిన మహేష్ బాబు(చిన్న పిల్లాడు అంత పెద్ద కారు ఏం చేసుకుంటాడు అని అడగకండి) , ఈసారి అంతకంటే మరింత విలువైన బహుమతిని సిద్ధం చేస్తున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘ఆగడు’ ఆడియో విడుదల కార్యక్రమాన్ని కొడుకు పుట్టినరోజు నాడే ఏర్పాటు చేయిస్తున్నాడు. మహేష్ బాబు పుట్టిన రోజు అయిన ఆగస్టు 9వ తేదీన ఈ సినిమా ట్రైలర్ విడుదల అవుతోంది. ఆగస్టు 31 గౌతమ్ పుట్టిన రోజు. 1.. నేనొక్కడినే సినిమాతో తెరంగేట్రం కూడా చేసేసిన గౌతమ్ కృష్ణకు ఇది చాలా అపురూపమైన బహుమతి అవుతుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఏ కొడుకూ ఊహించలేని అద్భుతమైన గిఫ్టును మహేష్ ఇస్తున్నాడు.

ఇక సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ 50వ చిత్రంగా ఆగడు వస్తోంది. ఈ సినిమా పాటలను తమన్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి అదరగొట్టాడని సినిమా యూనిట్ సభ్యులు అంటున్నారు. ఇక ఈ సినిమాలో శ్రుతిహాసన్ ఓ స్పెషల్ సాంగ్ చేస్తోంది. అందులో ఆమె బికినీలో కనిపిస్తుందని కూడా ఫిలింనగర్ లో ప్రచారం జరుగుతోంది. దాదాపు నాలుగు నిమిషాల పాటు ఉండే ఈ స్పెషల్ సాంగ్ సినిమాకే హైలైట్ అవుతుందంటున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 8th December 2017
[caption id="attachment_550514" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 8th December 2017[/caption]...
Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts