మోహన్ బాబుకి 'మా' జన్మదినశుభాకాంక్షలు

0

mohanవిలక్షణ నటుడు మోహన్‌బాబు చలనచిత్ర రంగంలో నటునిగా అడుగుపెట్టి దాదాపు నాలుగు దశాబ్దాలవుతోంది. ఆయన కథానాయకుడిగా పరిచయమైన ‘స్వర్గం నరకం’ 1975 నవంబర్‌లో విడుదలైంది. అంటే వచ్చే నవంబర్‌కు నటుడిగా ఆయన వయసు సరిగ్గా నలభై ఏళ్లన్న మాట. ఈ కాలంలో నటుడిగా ఆయన ఎదుగుతూ వచ్చిన క్రమం ఆశ్చర్యం కలిగించకమానదు. మొదట కథానాయకుడి వేషమేసినా, ఆనక ప్రతినాయకుడిగానే ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నారు. హీరో హీరోయిన్లకు కష్టాలు తెచ్చిపెట్టే క్రూర, దుష్ట పాత్రల్లో రాణిస్తూనే, తిరిగి హీరోగా మారారు. అలా అని విలన్‌ పాత్రలను వదల్లేదు. ‘సింహగర్జన’, ‘సింహబలుడు’ వంటి జానపద చిత్రాల్లో విలన్‌గా నటించిన ఆయన, తర్వాత ‘వీరప్రతా్‌ప’లో జానపద కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కె. రాఘవేంద్రరావు రూపొందించిన ‘అల్లుడుగారు’తో కథానాయకుడిగా ఆయన సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలైన సంగతి చాలామందికి తెలిసిందే. అక్కణ్ణించి అగ్రస్థాయి కథానాయకుడిగా ఆయన ఓ వెలుగు వెలిగారు. ‘పెదరాయుడు’తో బాక్సాఫీస్‌ వద్ద చరిత్ర సృష్టించారు. ‘యమదొంగ’, ‘యమలీల 2’ చిత్రాల్లో యమధర్మరాజుగా ప్రదర్శించిన అభినయం, ఆ పాత్రల్లో సంభాషణలు పలికిన తీరు ఆయన విలక్షణ నటనకు నిదర్శనాలు. ఆయనలోని ఉత్కృష్ట నటుణ్ణి చూడాలంటే ‘ఎమ్‌ ధర్మరాజు ఎంఎ’, ‘రాయలసీమ రామన్నచౌదరి’ చిత్రాలు చూడాలి. ఆయన సమకాలీన నటుల్లో మరొకర్ని ఆ పాత్రల్లో ఊహించుకోలేం. రౌద్ర రసాన్ని ఎంత ధీర గంభీరంగా పోషించగలరో, కరుణ రసాన్ని అంత ఉదాత్తంగానూ ప్రదర్శించగలిగే నటునిగా ఆయన పేరుపొందారు. ఇక బీభత్స, శృంగార, హాస్య రసాలను తనకే ప్రత్యేకమైన హావభావ విన్యాసాలతో ఆయన రక్తికట్టించే తీరు చూసి తీరాల్సిందే. నిరుడు ‘రౌడీ’లో వీర, రౌద్ర, కరుణ రసాలను అలవోకగా ప్రదర్శించి అభిమానులనే కాక సగటు ప్రేక్షకుణ్ణీ ఆయన ఆనందపరిచారు. రావణాసురుని పాత్రను తనదైన రీతిలో పోషించి, చరిత్రలో నిలిచిపోవాలనేది ఆయన చిరకాల కోరిక.మోహన్ బాబుకి ‘మా’ జన్మదినశుభాకాంక్షలు తెలుపుతోంది

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
powered by RelatedPosts