`మా ల‌వ్ జ‌ర్నీ స‌క్సెస్` ప్రారంభం

0

సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్‌ సాలూరి కథానాయకుడిగా ‘మా లవ్‌ జర్నీ సక్సెస్‌’ చిత్రం శనివారం రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ధన్వంతరీ క్రియేషన్స్‌ పతాకంపై కె.పి.లక్ష్మణాచారి నిర్మిస్తున్నారు. శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వం వహిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి నవీన్‌ యాదవ్‌ క్లాప్‌ ఇచ్చారు. కోటి గౌరవ దర్శకత్వం వహించారు.

కోటి మాట్లాడుతూ ‘‘రాజీవ్‌ నటిస్తున్న పదో సినిమా ఇది. మంచి బ్రేక్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమా కథ బావుంది. తనకి మంచి గుర్తింపు తెస్తుందనే నమ్మకం ఉంది. నేను సంగీతం అందించే ఏ సినిమా అయినా మొదటి సినిమాగానే భావిస్తా. సంగీతానికి మంచి స్కోపున్న సినిమా ఇది’’ అని అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ‘‘పదేళ్ల క్రితం ఇదే బేనర్‌లో ఓ సినిమా చేశా. మళ్లీ మంచి కథతో ఈ సినిమా చేస్తున్నా. ‘ప్రేమికుల్ని అర్థం చేసుకోకుండా నెట్టేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రేమికుల్ని విడదీయకూడదు… కలిపే ప్రయత్నం చెయ్యాలి’ అన్న కథాంశంతో రూపొందుతున్న సినిమా ఇది. హీరోయిన్‌ క్యారెక్టర్‌ క్లాస్‌గా, హీరో క్యారెక్టర్‌ మాస్‌గా ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘ప్రేమ విఫలమైతే ఏం చెయ్యాలో తెలియని నేటితరం ప్రేమికులకు తమ ప్రేమని ఎలా దక్కించుకోవాలో చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. పది రోజుల్లో రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలువుతుంది. త్వరలో చిత్రీకరణ పూర్తి చేసి జూన్‌లో సినిమాను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత తెలిపారు.

ఈ చిత్రానికి కెమెరా: పి.విజయ్‌కుమార్‌, సంగీతం: కోటి, ఎడిటర్‌: నందమూరి హరి, సాహిత్యం: చంద్రబోస్‌, వెనిగళ్ల రాంబాబు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
 ‘సడి’ షూటింగ్‌ ప్రారంభం
భాను ఎంటర్‌టైన్‌మెంట్స్‌- `శ్రీ సాయి అమృతల‌క్ష్మి క్రియేషన్స్ బేన‌ర్స్ పై గోదారి భానుచంద‌ర్  నిర్మిస్తోన్న చిత్రం ‘సడి’. పాలిక్ ద‌ర్శ‌క‌...
క‌ల్యాణ్ రామ్ హీరోగా ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం ప్రారంభం
నంద‌మూరి క‌ల్యాణ్ రామ్, నివేదా థామ‌స్‌, షాలిని పాండే హీరో హీరోయిన్లుగా ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం బుధ‌వారం హైద‌రాబాద్ ర...
powered by RelatedPosts