మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలు ప్రారంభమయ్యాయి

0

Maa Elections Poling Photos 04 (32)మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలు ఆదివారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఎప్పుడూ లేని విధంగా తారల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు, ప్రత్యారోపణలు చోటు చేసుకోవడంతో ఈసారి ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. పోలింగ్‌ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 రెండు గంటల వరకు జరుగుతాయి. ఫిలిం చాంబర్‌లో జరుగుతున్న ఎన్నికలకు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సినీ ప్రముఖలు తరలివస్తున్నారు.

అగ్రహీరోలు ఎవరూ ఇంతవరకు ఓటు వేసేందుకు రాలేదు. జయసుధ ప్యానెల్‌ సభ్యులు తమ ప్రచారం హోరాహోరీగా చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్‌ కొంచె ఆలస్యంగా చాంబర్‌కు వచ్చారు. ఆయన ఎక్కువ చర్చకు తావివ్వకుండా… ఒక మంచి మార్పు కోసమే నిలబడ్డామని… గెలిస్తే కష్టపడి పనిచేస్తామని, బీద కళాకారుల పట్ల ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తామని ఆయన అన్నారు. అనంతరం ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకు ముందే జయసుధ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

నిన్నటి వరకు రాజేంద్రప్రసాద్‌ ప్యానల్‌లో లేనని చెప్పిన శివాజీరాజా ఇప్పుడు ఆయన బరిలో ఉన్నారు. రాజేంద్రప్రసాద్‌ను ఒంటరిగా వదిలి వెల్లఢం ఇష్టం లేకే పోటీలో మళ్లీ నిలుచున్నానని ఆయన వివరణ ఇచ్చారు. జనరల్‌ సెక్రటరీగా పోటీ చేస్తున్నట్లు శివాజీరాజా చెప్పారు. గెలిపిస్తే కష్టపడి పని చేస్తామని, ఓడిపోయినా అంతకంటే ఎక్కువ కష్టపడి పనిచేస్తామని ఆయన అన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
powered by RelatedPosts