ప్రియుడి కోసం ప్రియురాలి తిప్పలు

0

katrina_kaif_ranbir_kapoorరణ్ బీర్ కపూర్- కత్రినా కైఫ్ లవ్ స్టోరీ గురించి బి-టౌన్ లో ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెపుతాడు. అప్పుడప్పుడు సీక్రెట్ గా కలుసుకోవడం, జంటగా టూర్లు వేయడం.. షికార్లు కొట్టడం ఈ జంటకు కొత్తేం కాదు.. వాళ్ల యవ్వారం గురించి మాట్లాడుకోవడం సినీజనాలకు కూడా కొత్తకాదు అనుకోండి. అయితే ఈ మధ్య బాయ్ ఫ్రెండ్ సినిమాలను అనఫిషియల్ బ్రాండ్ అంబాసిడర్లుగా బ్యూటీలు పనిచేస్తుండటం ట్రెండ్ గా మారిపోయింది. ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచే.. అహా.. ఓహో అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడం ముద్దుగుమ్మలకు అలవాటు అయిపోయింది. రీసెంట్ గా క్యాట్ కూడా తన రహస్య స్నేహితుడు రణ్ బీర్ కపూర్ నటించిన బాంబే వెల్వెట్ సినిమాను ఫుల్లుగా ప్రమోట్ చేసి.. అతనిపై తనకున్న ఇదిని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది.బాలీవుడ్ రొమాంటిక్ బాయ్ రణ్ బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ బాంబే వెల్వెట్ ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అయింది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రచార చిత్రానికి అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. అయితే తన చెలికాడు నటించిన చిత్రం కావడంతో.. కత్రినా మాత్రం అప్పుడే సినిమా హిట్ అయినట్లు బాలీవుడ్ సెలబ్రిటీస్ ను పిలిచి అదిరిపోయే పార్టీ ఇచ్చింది. ఆమిర్ ఖాన్, ఆదిత్యరాయ్ కపూర్, అర్జున్ కపూర్, కిరణ్ రావ్ వంటి స్టార్స్ బాంబే వెల్వెట్ ట్రైలర్ సక్సెస్ పార్టీకి హాజరై సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పారట. పనిలో పనిగా రణ్ బీర్ సినిమాకు ఫ్రీ క్యాంపెనింగ్ చేస్తున్న క్యాట్ ప్రేమ కూడా పెళ్లిపీటల వరకు వెళ్లాలని మనసులో దీవించి పంపారట. ఏదేమైనా పార్టీ పేరుతో కత్రినా రణ్ బీర్ పై తనకున్న ప్రేమను చెప్పకనే చెప్పిందని బాలీవుడ్ జనాలు ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు. మరి ట్రైలర్ కే ఇంత హంగామా చేస్తున్న క్యాట్.. సినిమా రిలీజ్ అయ్యాక ఇంకెంత రచ్చ చేస్తుందో చూడాలి

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ని అభినందించిన TFJA
టి. న్యూస్ ఎండి , తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యులు గా ఎన్నికైన నేపథ్యంలో సాటి మీడియా మిత్రుడిని స...
ప్రశ్నిస్తా' సినిమా ప్రారంభం
జనం ఎంటర్టైన్మెంట్ పతాకంపై ప్రముఖనిర్మాత సత్య రెడ్డి నిర్మిస్తున్న 'ప్రశ్నిస్తా' మూవీ కి తన కుమారుడైన మనీష్ బాబు ని హీరోగా పరిచయం చేస్తూ రాజా వన్...
యదార్థ సంఘటనలతో 'మర్లపులి..23న రిలీజ్
సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బోన్ క్రాఫ్ట్ క్రియేషన్స్ పతాకంపై డి నరసింహ సమర్పించిన చిత్రం 'మర్లపులి'. వరుణ్ సందేశ్ ప్రత్యేకపాత్రలో,...
powered by RelatedPosts