ల‌వ్ క‌మ్ యాక్ష‌న్ మూవీ ఇది: ద‌ర్శ‌కుడు బోయ‌పాటి

0
బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడుగా ద్వారకా క్రియేషన్స్‌ బేనర్‌పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘జయజానకినాయక’. ఈ సినిమా ఆగస్ట్‌ 11న విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి మాట్లాడుతూ, `
 ‘జయజానకినాయక’ ప్రతి ఒక్కరి గుండెను టచ్‌ చేసే సినిమా. హార్ట్‌ఫుల్‌ మూవీ. నేను నా మొదటి సినిమా భద్రను మంచి లవ్‌, ఫ్యామిలీ ఎమోషన్స్‌, యాక్షన్‌ ఇలా అన్ని ఎలిమెంట్స్‌ కలగలిపి బ్యూటీఫుల్‌ లవ్‌స్టోరీగా ఎలా చేశానో అలాంటి లవ్‌స్టోరీ జయజానకినాయక. ఇందులో కూడా అద్భుతమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌, యాక్షన్‌ ఎలిమెంట్స్‌ అన్ని ఉంటాయి. కొత్తగా ఉండాలనే ఆలోచనతోనే టైటిల్‌ విషయంలో కొత్తగా ఉండేలా ప్లాన్‌ చేసుకున్నాను. నేను ఇప్పటి వరకు చేసిన ఆరు సినిమాలు డిఫరెంట్‌గా ఉంటాయి. జయజానకినాయక భద్ర స్టయిల్‌లో ఉంటుంది. అలాగే నా స్టయిల్‌లో యాక్షన్‌ పార్ట్‌ కూడా ఉంటుంది. కథలో భాగంగానే పాటలు, ఫైట్స్‌ అన్నీ చక్కగా అమరాయి. మనకొక క్యారెక్టర్‌ ఉండాలి. మన మాటకు ఒక విలువుండాలి. అలా సరైనోడు తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్‌తో సినిమా చేస్తానని మాటిచ్చాను. ఆ మాట కోసం ఈ సినిమా చేశాను. అలాగని ఏదో సినిమా చేయాలని కాకుండా నేను చేసిన ఆరు సినిమాలకంటే ఓ పాయింట్‌ ఎక్కువగానే ఈ సినిమాను తెరకెక్కించాను. లెజండ్‌ తర్వాత బన్నితో సరైనోడు సినిమా చేసే సమయంలో మీకెలా సరిపోతుందని చాలా మంది అన్నారు. అయితే సరైనోడు సినిమాను బన్ని బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లుగానే తెరకెక్కించాను. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్‌ బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లుగా ఈ సినిమాను తెరకెక్కించాను. డైలాగ్స్‌ కూడా తన వయసుకు తగ్గట్టే ఉంటాయి. శ్రీను రా మెటీరియల్‌. ఈ సినిమా కోసం 25-30 కిలోల బరువు పెరిగాడు. తర్వాత 17 కిలోల వరకు తగ్గి మేకోవర్‌ అయ్యాడు. సినిమా చూసిన తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్‌ వంటి యువకుడు మన కుంటుంలో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.
నేను ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక మెసేజ్‌ ఇస్తూనే వచ్చాను. అలాగే ఈ సినిమాలో అమ్మాయిలకు సంబంధించి మంచి మెసేజ్‌ ఉంటుంది. నిజమైన ప్రేమేంటి? మనం అమ్మాయిలను ఎలా కాపాడుకోవాలని ఈ సినిమాలో చూపించాను. నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి డబ్బు పెట్టాడని కాదుగానీ తనకి సినిమాలంటే ప్యాషన్‌. నన్ను కలిసిన రోజు ఒక మాట అన్నాడు. సార్‌..నేను జీవితంలో చెప్పుకునే సినిమా ఒకటి చేయాలి. తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలి. డబ్బుతో నాకు సంబంధం లేదు’ అని చెప్పాడు. తన మాట ప్రకారం ఎక్కడ ఎంత అవసరమో అంతగా ఖర్చు పెట్టి చేసిన సినిమా ఇది. ప్రస్తుతం చిరంజీవిగారు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమా చేయబోతున్నారు. తర్వాత ఏ సినిమా చేస్తారో తెలియదు కానీ, ఆయనకు కథ రెడీ చేసేశాను. రెండు నెలలు ఇంకా టైమ్‌ తీసుకుని ఇంకా బాగా వచ్చేలా రాసుకుంటున్నాను. అలాగే మహేష్‌గారికి తగ్గ కథ కూడా రెడీ. ఇప్పటి వరకు ఆయన చేయని జోనర్‌ మూవీ. ఆయన డేట్స్‌ ఎక్కువగా కావాల్సి ఉంటుంది. అలాగే వచ్చే ఏడాది జూన్‌, జూలైకంతా బాలయ్యబాబుతో సినిమా స్టార్ట్‌ చేసేస్తాను.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ని అభినందించిన TFJA
టి. న్యూస్ ఎండి , తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యులు గా ఎన్నికైన నేపథ్యంలో సాటి మీడియా మిత్రుడిని స...
సాయి శ్రీనివాస్ తో మ‌రో శ్రీనివాస్
యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా మరో సినిమా సైన్ చేశారు. పలు సూపర్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన శ్రీని...
ఛ‌లో డైరెక్ట‌ర్ తో న‌యా బ్యాన‌ర్!
నాగశౌర్య .. రష్మిక మండ‌న‌ జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెర‌కెక్కిన ‘ఛలో’ ఇటీవ‌ల విడ‌దులైన స‌క్సెస్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ అన్ని వ‌ర్గాల...
powered by RelatedPosts