లై రివ్యూ

0
నటీనటులు: నితిన్‌.. మేఘా ఆకాష్‌.. అర్జున్‌.. శ్రీరామ్‌.. అజయ్‌.. నాజర్‌.. రవికిషన్‌.. బ్రహ్మాజీ.. పృథ్వీరాజ్‌.. బ్రహ్మానందం తదితరులు
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: జె.యువరాజ్‌
నిర్మాత: రామ్‌ ఆచంట.. గోపీచంద్‌ ఆచంట.. అనిల్‌ సుంకర
రచన-దర్శకత్వం: హను రాఘవపూడి
సంస్థ: 14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
మాస్టార్స్.కామ్ రేటింగ్ 3/5
ముందుమాట‌: యూత్ స్టార్ నితిన్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. వ‌రుస‌గా సక్సెస్ లు అందుకుంటూ గ్రాఫ్  ను మరింత పెంచుకుంటున్నాడు. తాజాగా ఆయ‌న క‌థానాయ‌కుడిగా హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `లై` నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఆ సినిమా క‌థా క‌మామీషు ఏంటో ఓసారి చూద్దాం.
క‌థ‌: పద్మనాభం (అర్జున్‌) మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌. అమెరికాలో ఉంటాడు. అతన్ని పట్టుకోవడానికి ఇండియన్‌ పోలీసులు ప్రయత్నిస్తుంటారు. ఒకసారి చిక్కినట్టే చిక్కి చేజారిపోతాడు. మళ్లీ 19ఏళ్లకు ఆ అవకాశం వస్తుంది. ఎ.సత్యం(నితిన్‌)కు అమెరికా అంటే పిచ్చి. వేగాస్‌కు వెళ్లి అక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్‌ అయిపోవాలనుకుంటాడు. చైత్ర (మేఘా ఆకాష్‌ )పరమ పిసినారి. తాను కూడా వేగాస్‌ వెళ్లి జూదం ఆడి డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటుంది. సత్యంతో కలిసి వేగాస్‌ వెళ్తుంది చైత్ర. వీరిద్దరికీ ఉన్న పరిచయం ఏమిటి? పద్మనాభం పోలీసులకు దొరికాడా? అమెరికా వెళ్లిన సత్యం ఏం చేశాడు? అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాల‌సిస్: హ‌ను రాఘ‌వ‌పూడి సినిమాలు రొటీన్ కు భిన్నంగా ఉంటాయి. కొత్త‌గా చూపించాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతుంటాడు. ఇప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న చేసిన సినిమాలు క‌మ‌ర్శియ‌ల్ గా ఎలా ఉన్నా?  ద‌ర్శ‌కుడి త‌న‌లో ట్యాలెంట్ ను మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు ప్రూవ్ చేసుకుంటున్నాడు. తాజాగా ఈసారి లై అనే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ని తెర‌కెక్కించాడు. క‌థ బేస్ పాయింట్ పాత‌దే అయినా ట్రీట్ మెంట్ మాత్రం చాలా కొత్త‌గా ఉంది. మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్ ను ప‌ట్టుకోవ‌డం చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ను  చాలా కొత్త‌గా చూపించాడు. క‌థ‌నాన్ని ఆస‌క్తిక‌రంగా మ‌లిచే ప్ర‌య‌త్నం చేశాడు..గానీ అది పెద్ద‌గా వ‌ర్కౌట్ కాలేదు. నితిన్ స్టైలిష్ గా కనిపించాడు. అలాగే అర్జున్ పాత్ర ను కొత్త‌గా చూపించాడు. హీరో , హీరోయిన్ మ‌ధ్య ల‌వ్ ట్రాక్ అంత‌గా పండ‌లేదు. ద‌ర్శ‌కుడు పూర్తిగా యాక్ష‌న్ పై నే దృష్టి పెట్ట‌డంతో రొమాన్స్ కు అంత‌గా తావు లేకుండా పోయింది. అక్క‌డ‌క్కా చూపించినా ఫీల్ క్యారీ కాలేదు. ఇక ద్వితియార్థంలో క‌థ వేగం పుంజుకుంటుంది. హీరో, విల‌న్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు బాగున్నాయి. అర్జున్ ఆ పాత్ర పోషించ‌డంతో సినిమాకు బాగా క‌లిసొచ్చింది. అత‌ని ఆహార్యం బాగుంది.  ముఖ్యంగా మైండ్ గేమ్ స‌న్నివేశాలు హైలైట్ గా ఉన్నాయి.  ఆ పాత్ర‌ను కూడా చాలా స్టైలిష్ గా డిజైన్ చేశాడు. అయితే అసంద‌ర్భంగా వ‌చ్చే కొన్ని స‌న్నివేశాలు విసుగు పుట్టిస్తాయి. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్, మైండ్ గేమ్ చిత్రాల‌ను ఇష్ట‌ప‌డే వారికి లై ని బాగా లైక్ చేస్తారు.
న‌టీన‌టులు:  నితిన్ న‌ట‌న బాగుంది. స్టైలిష్ లుక్ లో కొత్త‌గా కనిపించాడు. అలాగే అర్జున్ పాత్ర‌ను కూడా అంతే స్టైలిష్ గా డిజైన్ చేశాడు. మేఘ ఆకాష్ న‌ట‌న బాగుంది. మిగ‌తా పాత్ర‌లు బాగున్నాయి.
సాంకేతివ‌ర్గం: కథాంశం బాగుంది. హ‌ను ప్ర‌తీ స‌న్నివేశాన్ని చాలా  స్టైలిష్‌ మేకింగ్ తో అద‌ర‌గొట్టాడు. అలాగే మలుపులు బాగున్నాయి. కెమెరా వ‌ర్క్ బాగుంది.  ఎడిటింగ్ లోపాలున్నాయి. మ‌ణిశ‌ర్మ సంగీతం బాగుంది. ఆర్. ఆర్ బాగా కుదిరింది.
చివ‌రిగా:   `లై` లైక్ చేస్తుంది
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు సినీ టివి డైరి లాంచ్
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ...
టెల్ మీ బాస్ పిక్చర్స్ 'కుమార్ రాజా` కొత్త చిత్రం ప్రారంభం
Tellmeboss Pictures పతాకంపై నిర్మాత శ్రీచక్ర మల్లికార్జున తన స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తొలిచిత్రం ‘కుమార్ రాజా’ చిత్ర...
powered by RelatedPosts